BIKKI NEWS (JUNE 09) : World accreditation day june 9th. వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థలో అక్రిడిటేషన్ పాత్రను గుర్తించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జూన్ 9న వరల్డ్ అక్రిడిటేషన్ దినోత్సవం గా జరుపుకుంటారు.
World accreditation day june 9th
ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, విద్యాసంస్థలు, ప్రయోగశాలలు, ధ్రువీకరణ సంస్థలు మొదలైన వాటి సామర్థ్యం, విశ్వసనీయతను నిర్ధారించడాన్ని అక్రిడిటేషన్ అంటారు.
వినియోగదారులు, వ్యాపారులు నియంత్రణ సంస్థల్లో నమ్మకం, విశ్వసాన్ని పెంపొందించడంలో అక్రిడిటేషన్ కీలకపాత్రను పోషిస్తుంది.
ఉత్పత్తులు, సేవలు వ్యవస్థలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లు హామీ ఇవ్వడం ద్వారా ఇది జరుగుతుంది. దీంతో అంతర్జాతీయ వ్యాపారం సులభం కావడంతో పాటు ప్రజారోగ్యం భద్రతకు మద్దతుగా ఉంటుంది.
అక్రిడిటేషన్ విలువలు ప్రయోజనాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం.
అంతర్జాతీయ వ్యాపారాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయా వస్తు సేవల స్థాయిని నిర్ధారించే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ లేబరేటరీ అక్రిడిటేషన్ కోఆపరేషన్ మ్యూచువల్ రికగ్నిషన్ అరేంజ్మెంట్ తెచ్చింది. దీన్ని 1994 జూన్ 9న సభ్య దేశాలు ఆమోదించాయి. 2007లో జరిగిన ఇంటర్నేషనల్ లేబరేటరీ అక్రిడేషన్ కోఆపరేషన్, ఇంటర్నేషనల్ అక్రిడేషన్ ఫోరం ఉమ్మడి సమావేశంలో ఏటా జూన్ 9న వరల్డ్ అక్రిడిటేషన్ దినోత్సవం గా జరుపుకోవాలని తీర్మానించాయి.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్