Home > TELANGANA > లక్షమంది మహిళలతో 12న మహిళ దినోత్సవ వేడుకలు

లక్షమంది మహిళలతో 12న మహిళ దినోత్సవ వేడుకలు

BIKKI NEWS (MARCH 08) : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 12 తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో దాదాపు లక్ష మంది స్వయం సహాయక బృందాల మహిళలచే (women’s day celebrations with one lakh women) రాష్ట్ర మహిళా సదస్సును నిర్వహించనున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న మహిళా సదస్సు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

లక్ష మంది మహిళలచే ఈ నెల 12 తేదీన నిర్వహించే రాష్ట్ర మహిళా సదస్సులో రాష్ట్ర ముఖ్య మంత్రి ఏ. రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరవుతారని సి.ఎస్ తెలిపారు. ఈ సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళ స్వయం సహాయక బృందాల సభ్యులు పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్బంగా పరేడ్ గ్రౌండ్ లో చేసే ఏర్పాట్లు, పార్కింగ్, హాజరయ్యే మహిళలకు తగు ఏర్పాట్లపై ఈ టెలి కాన్ఫరెన్స్ లో శాంతి కుమారి సమీక్షించారు.

డీజీపీ రవీ గుప్తా, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస రాజు, హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ శ్రీనివాస రెడ్డి, సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ హనుమంత రావు తదితర అధికారులు ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.