AGNI MISSILES : పూర్తి సమాచారం

BIKKI NEWS : AGNI – V – MISSILE ను భారత రక్షణ శాఖ ఒడిస్సా లోని ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి విజయవంతంగా ప్రయోగించింది. అగ్ని క్షిపణుల శ్రేణిలో ఇది ఐదవది. అణ్వస్త్రాలను సైతం మోసుకెళ్ళగల సామర్థ్యం ఈక్షిపణికి ఉంది. 5 వేల పైబడిన కిలోమీటర్ల దూరంలో గల లక్ష్యాలను కచ్చితత్వంతో చేదించగల సామర్థ్యం ఈ క్షిపణిది. హైదరాబాద్ డి ఆర్ డి ఓ సంస్థ ఈ క్షీపనలను తయారు చేయడం విశేషం.ఇది ఒక ఖండంతార క్షిపణి, ఆసియా ఖండం మొత్తం ఈ క్షిపణి పరిధిలోకి రానుంది.

మూడు దశల ఘన ఇంధనంతో నడుస్తోంది. 17.5 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పు తో ఉంటుంది. 50 వేల కేజీల బరువు కలిగి ఉంటుంది. 1,500 కేజీల అణ్వస్త్రాలను మోసుకెళ్ళగలదు.

అగ్ని క్షిపణులు అగ్ని – I, II, III, IV, V, VI కలవు. అగ్ని – I,II,III,IV,V లు రక్షణ శాఖకు అందుబాటులో కలవు. ఇందులో అగ్ని – VI ప్రయోగ దశలో ఉంది.

పోటీ పరీక్షల నేపథ్యంలో అగ్ని క్షిపణుల గురించి పరిపూర్ణ సమాచారం మీకోసం…

◆ TYPES OF AGNI MISSILES AND RANGE

క్షిపణిరకంపరిధి (కీ.మీ.)
అగ్ని – 1మద్యంతర క్షిపణి700-1,250
అగ్ని – 2మద్యంతర క్షిపణి2,000 – 3,000
అగ్ని – 3మద్యంతర క్షిపణి3,500 – 5,000
అగ్ని – 4మద్యంతర క్షిపణి4,000 – 6,500
అగ్ని – 5ఖండాతర క్షిపణి5,000 – 8,000
అగ్ని – 6ఖండాతర క్షిపణి8,000 – 10,000