Home > JOBS > TELANGANA JOBS > Mee Seva Centres – మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులు

Mee Seva Centres – మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులు

BIKKI NEWS (JULY 02) : new mee seva centers applications in jagtial district. జగిత్యాల జిల్లాలో 09 మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వనిస్తూ ప్రకటన విడుదల చేశారు.

new mee seva centers applications in jagtial district

తాళ్ళ ధర్మారం, జగిత్యాల అర్బన్ పాత బస్టాండ్ దగ్గర ,. సారంగాపూర్ – పెంబట్ల, కొడిమ్యాల- నమిలి కొండ, కోరుట్ల – మోహన్ రావుపేట, వెల్గటూర్ – కప్పరావ్ పేట, మెట్‌పల్లి – దావిడిలలో ఒక్కోక్కటి చొప్పున మీ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

దరఖాస్తు చేయు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తుదారు దరఖాస్తు ఫారమ్ ను నింపి, సంబంధిత తహశీల్దార్ కార్యాలయంలో ఫారమ్ ను సమర్పించాలి.

జగిత్యాల జిల్లా అధికారిక వెబ్ సైట్ https://www.jagtial.telangana.gov.in నుండి దరఖాస్తు ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోగలరు:

దరఖాస్తు గడువు : జూలై 17 – 2025 వరకు

అర్హత ప్రమాణాలు:

ధరఖాస్తు దారుడు నిరుద్యోగి అయి ఉండవలెను.

జగిత్యాల జిల్లా కలెక్టర్ గారి పేరు మీద 500/- డీడీ కట్టి అర్జీతో సమర్పించగలరు.

ఏదైనా గ్రాడ్యుయేట్ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హతతో కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

దరఖాస్తుదారు తప్పనిసరిగా అకాడమిక్ సర్టిఫికెట్లు మరియు కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికెట్లు కలిగి ఉండాలి.

అవసరమైన మౌలిక సదుపాయాలను పెట్టుబడి పెట్టడానికి తగిన స్థోమత కలిగి ఉండాలి.

దరఖాస్తుదారు యొక్క వయసు 18-35 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి.

దరఖాస్తుదారు జగిత్యాల జిల్లాలోని అదే మండలానికి, గ్రామ పంచాయితీ లేదా సమీప గ్రామ పంచాయితీకి చెందినవారై ఉండాలి.

మీ సేవ కేంద్రమునకు ఎంపిక చేయబడిన అభ్యర్థి, వారి మండలములో నిర్దేశించబడిన ప్రదేశములో మాత్రమే కేంద్రము ఏర్పాటు చేయవలెను. తదుపరి ఎటువంటి కారణం చేతనైనా స్థాన మార్పిడికి అనుమతించబడదు.

సర్టిఫికేట్ వేరిఫికేషన్ సమయంలో కింది సర్టిఫికెట్లు అథారిటీ ద్వారా తనిఖీ చేయబడతాయి.

i. SSC నుండి గ్రాడ్యుయేట్ వరకు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు.

ii. నివాస ధృవీకరణ పత్రం.

iii. కుల ధ్రువీకరణ పత్రం.

దరఖాస్తుకు అనుబంధముగా సమర్పించబడిన ఆధార పత్రాలు అన్నీటిపై ఆధీకృత దృవీకరణ (గెజిటెడ్ అటెస్టేషన్) చేయించి జతపరచవలెను.

తనిఖీలో అనుమతించబడిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి పరీక్షకు అర్హత ఇవ్వబడును.

పరీక్షా విధానం : IT నైపుణ్యాలను (100 మార్కులు) అంచనా వేయడానికి వ్రాత పరీక్ష నిర్వహించబడును.

రాత పరీక్ష విధానం : ప్రాధమిక కంప్యూటర్ నాలెడ్జ్ మరియు తెలంగాణ స్టేట్ మీసేవా సర్వీసెస్ (ఆబ్జెక్టివే టైప్) పై ఉంటుంది.

వెబ్సైట్ : website

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు