BIKKI NEWS : WOMEN CHIEF MINISTERS LIST. భారతదేశం లో వివిధ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన మహిళ ముఖ్యమంత్రుల జాబితాను పోటీ పరీక్షల నేపథ్యంలో మీ కోసం
తాజాగా డిల్లీ ముఖ్యమంత్రిగా అతిశీ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. భారతదేశంలో 17వ మహిళ ముఖ్యమంత్రిగా అతిశీ నిలిచారు.అలాగే డిల్లీకి 3వ మహిళ ముఖ్యమంత్రిగా నిలిచారు.
అలాగే ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ఉన్నారు.
భారతదేశ మొట్టమొదటి మహిళ ముఖ్యమంత్రి – సుచేతా కృపలానీ (యూపీ), అత్యధిక కాలం (15 సంవత్సరాలు) పని చేసిన మహిళ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ (డిల్లీ), అతి తక్కువ కాలం (23 రోజులు) పని చేసిన మహిళ ముఖ్యమంత్రి విఎన్ జానకి రామచంద్రన్ (తమిళ నాడు)
WOMEN CHIEF MINISTERS LIST
1) సుచేతా కృపలానీ : భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళ ముఖ్యమంత్రి. 1963 – 67 వరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గా పనిచేశారు.
2) నందిని శతపధి : 1972 – 76 వరకు ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు.
3) శశికళ కకోద్కర్ : 1973 – 79 వరకు గోవా, డమాన్ డయ్యూలకు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి గా పనిచేశారు.
4) అస్వర తైముర్ : భారత దేశంలో మొట్టమొదటి మహిళ ముఖ్యమంత్రి. 1980 – 81 వరకు అస్సాం ముఖ్యమంత్రి గా పనిచేశారు
5) విఎన్ జానకి రామచంద్రన్ : తమిళనాడు రాష్ట్రానికి 1988లో 23 రోజుల పాటు ముఖ్యమంత్రి గా పనిచేశారు.
6) జె. జయలలిత : తమిళనాడు రాష్ట్రానికి 6 సార్లు,.14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి గా పనిచేశారు.
7) మయావతి : ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా 4 సార్లు, 7 సంవత్సరాల పాటు పని చేశారు
8) రాజేందర్ కౌల్ భట్టాల్ : 1996 నుంచి 1997 వరకు పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా పనిచేశారు.
9) రబ్రీదేవి : 1977 లో బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా పనిచేశారు.
10) సుష్మా స్వరాజ్ : డిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రిగా పని చేశారు. 1998లో 52 రోజుల పాటు పని చేశారు
11) షీలా దీక్షిత్ : డిల్లీకి రెండో మహిళా ముఖ్యమంత్రిగా పని చేశారు. దేశంలో అత్యధిక కాలం పనిచేసిన మహిళ ముఖ్యమంత్రి గా రికార్డు. 1998 – 2013 వరకు 15 సంవత్సరాలు డిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రిగా పని చేశారు.
12) ఉమాభారతి : 2003 – 2004 వరకు మద్యప్రదేశ్ రాష్ట్ర డిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రిగా పని చేశారు.
13) వసుంధరా రాజే : రాజస్తాన్ ముఖ్యమంత్రి గా రెండు పర్యాయాలు పనిచేశారు
14) మమతా బెనర్జీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గా 2011 నుంచి పని చేస్తున్నారు.
15) ఆనందిబెన్ పటేల్ : గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా 2014 – 16 వరకు పనిచేశారు.
16) మహబూబా ముఫ్తీ : జమ్మూకాశ్మీర్ రాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రి. 2016 – 18 వరకు ముఖ్యమంత్రిగా పని చేశారు.
17) అతిశీ మర్లినా సింగ్ : డిల్లీ మూడో మహిళ ముఖ్యమంత్రి గా 2024 సెప్టెంబర్ 21న బాధ్యతలు స్వీకరించారు.