Home > UNCATEGORY > జీజేసీ సంగెంలో ఘనంగా వెల్‌కమ్ పార్టీ

జీజేసీ సంగెంలో ఘనంగా వెల్‌కమ్ పార్టీ

BIKKI NEWS (SEP. 25) : Welcome party in GJC Sangem. ప్రభుత్వ జూనియర్ కళాశాల సంగెంలో నూతన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ సీనియర్ విద్యార్థులు వెల్కమ్ పార్టీని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంఘం మండల ఎమ్మార్వో రాజ్ కుమార్, ఎంపీడీవో రవీందర్, ఎస్సై ఎల్ నరేష్ లు హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది.

Welcome party in GJC Sangem.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కాకా మాధవరావు మాట్లాడుతూ… విద్యార్థులు కష్టపడి చదివి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును నిర్మించుకోవాలని దానికి పునాది ఇంటర్మీడియట్ విద్యే అని, ప్రభుత్వ కళాశాలలోనే నాణ్యమైన విద్య అందించబడుతుందని అందుకుగాను విద్యార్థులు చక్కగా చదువుకొని కళాశాలకు మరియు వారి తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కళాశాల సీనియర్ అధ్యాపకురాలు శ్రీమతి బి విజయనిర్మల మరియు గ్రంథపాలకులు రాజ్ కుమార్, అధ్యాపకులు బుచ్చిరెడ్డి, యాకసాయిలు, నాగరాజు, పవన్ కుమార్, సుధీర్ కుమార్, రాఖీ, మాధవి, చిరంజీవి, శివ, కార్తీక్, రమాదేవి, అక్రమ్ అలీ, లక్ష్మి, సంగీత, కుమారస్వామి, అనిల్ కుమార్, సదయ్య తదితరులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు