Home > UNCATEGORY > రంగసాయిపేట ప్రభుత్వ కళాశాలలో స్వాగతోత్సవ హంగామా

రంగసాయిపేట ప్రభుత్వ కళాశాలలో స్వాగతోత్సవ హంగామా

BIKKI NEWS (OCT. 01) : Welcome party in gjc rangasaipeta. రంగసాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వాగతోత్సవ కార్యక్రమ హంగామా అంగరంగ వైభవంగా జరిగింది. మంగళవారం రోజున కళాశాల ఆవరణలో ద్వితీయ సంవత్సర విద్యార్థులు ఈ విద్యాసంవత్సరం కళాశాలలో ప్రథమ సంవత్సరంలో ప్రవేశం తీసుకున్న విద్యార్థుల కొరకు స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు ఆట పాటలతో హంగామా చేశారు.

Welcome party in gjc rangasaipeta

కళాశాల ప్రిన్సిపాల్ బి. సంపత్ కుమార్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి కే. మాధవరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంటర్మీడియట్ స్థాయిలో విద్యార్థులు తమ పూర్తి సమయాన్ని కేవలం విద్యపై మాత్రమే కేంద్రీకరించాలని అన్నారు. అలాంటప్పుడే ఎంచుకున్న లక్ష్యాలు సాధించవచ్చునని విద్యార్థులకు సూచించారు.

మరో అతిథిగా హాజరైన రంగసాయిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు ఎన్ని ఉన్నత పదవులు అధిరోహించిన విద్య నేర్పిన గురువులను, కన్న తల్లిదండ్రులను మరచిపోరాదని సూచించారు. ఉత్తమ విద్యను అభ్యసించి కళాశాలకు మంచి పేరు తీసుకు రావాలి విధ్యర్హులను కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు