హైదరాబాద్ (సెప్టెంబర్ – 26) : Waheeda Rahman choosen for Dadasaheb Phalke Award 2023 – వహీదా రెహ్మాన్ కు ఈ సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్ టైమ్ ఏచీవ్‌మెంట్ అవార్డు – 2023 అవార్డు దక్కింది
బాలీవుడ్ సీనియర్ నటి వహీదా రెహ్మాన్కు దాదా సాహెబ్ ఫాల్కే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును కేంద్రం ప్రకటించింది. సినిమా రంగానికి ఆమె చేసిన కృషికిగాను ఈ అవార్డు ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
1938లో జన్మించిన వహీదా రెహ్మాన్.. 1955లో ‘రోజులు మారాయి’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత తమిళం, హిందీ, బెంగాళీ, మలయాళ భాషల్లో దాదాపు 100 సినిమాల్లో నటించారు.