BIKKI NEWS (FEB. 05) : Vikasith bharath 2047 seminar successfully conducted in Satavahana University. శాతవాహన విశ్వవిద్యాలయం, అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో వికసిత్ భారత్@2047: ఇండియా విజన్ ఫర్ డెవలప్మెంట్” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు బుధవారం ముగిసింది.
Vikasith bharath 2047 seminar successfully conducted in Satavahana University
ఈ సదస్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా రిటైర్డ్ ఐఏఎస్, శాతవాహన విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి టీ. చిరంజీవులు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ అండ్ రీసెర్చ్ సదరన్ రీజియన్ డైరెక్టర్ ప్రొఫెసర్. బి.సుధాకర్ రెడ్డి
హాజరయ్యారు.
ఈ సందర్భంగా రిటైర్డ్ ఐఏఎస్ టి.చిరంజీవులు మాట్లాడుతూ… స్వతంత్రం వచ్చినప్పటి నుండి భారతదేశం సాధించిన విజయాలను గుర్తించాలని భారత ఆర్థిక వ్యవస్థ ఎన్నో సమస్యలకు పరిష్కారాలను సూచించిందని వికసిత్ భారత్ యొక్క లక్ష్యాలను సమర్ధవంతంగా అమలు చేసినట్లయితే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడంలో ఎటువంటి సందేహం లేదన్నారు.
విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ యు. ఉమేష్ కుమార్ మాట్లాడుతూ… నేను పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి విశ్వవిద్యాలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని అందులో భాగంగా విశ్వవిద్యాలయానికి ఇంజనీరింగ్, న్యాయ, ఎం.ఫార్మసీ కోర్సులకు ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకువచ్చానని ఈ విద్యా సంవత్సరం నుండి తరగతులు ప్రారంభం అవుతాయని, ఆడిటోరియాన్ని డిజిటల్ ఆడిటోరియంగా శాతవాహన విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచుతానని, శాతవాహన విశ్వవిద్యాలయాన్ని వికసిత్ శాతవాహనగా అభివృద్ధి చేస్తానని ఉద్ఘాటించారు.
శాతవాహన విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ రవికుమార్ జాస్తి మాట్లాడుతూ… భారతదేశం వర్తక వాణిజ్య రంగాలలో ప్రపంచ దేశాల మార్కెట్లతో పోటీ పడుతుందని ఇదే వికసిత్ భారత్ కు ఒక సంకేతమని వివరించారు.
మరొక విశిష్ట అతిథి ఫ్రొఫెసర్. బి. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ… భారతదేశ ఆర్థిక వ్యవస్థలోని వ్యవసాయ, పారిశ్రామిక రంగం మరియు సేవా రంగాలలో స్థిరమైన వృద్ధి సాధించినప్పుడు భారతదేశము ఒక అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ఉద్బోధించారు.
విసి ఓఎస్ డి డాక్టర్. డి.హరికాంత్ మాట్లాడుతూ… భారతదేశం అన్నిరంగాలలో అభివృద్ధి సాధిస్తుందని త్వరలోనే అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని వివరించారు.
సెమినార్ డైరెక్టర్, అర్థశాస్త్ర విభాగపు హెచ్.ఓ.డి డాక్టర్ కోడూరి శ్రీవాణి మాట్లాడుతూ… రెండు రోజుల జాతీయ సదస్సులో నాలుగు టెక్నికల్ సెషన్స్ ద్వారా యాభై మంది ఆచార్యులు, అధ్యాపకులు, పరిశోధకులు తమ పరిశోధనా పత్రాలను సమర్పించి చర్చల్లో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు రోజుల జాతీయ సదస్సులో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సురేపల్లి సుజాత, మాజీ రిజిస్ట్రార్ ఫ్రొఫెసర్ యం. వరప్రసాద్, యుజిసి అఫైర్స్, ఉమెన్ సెల్ డైరెక్టర్ డాక్టర్. కే .పద్మావతి, డాక్టర్ .మహ్మద్ జాఫర్ జర్రి, డాక్టర్. అబ్రహం బాకీ, డాక్టర్. బేగం , డాక్టర్ మునావర్ , విద్యాసాగర్ కనకయ్య డా.తిరుపతి, డా.ఫాతిమా సుల్తానా బేగం, డా.జమున, వెంకటేష్ విశ్వవిద్యాలయ అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు , విద్యార్థినీ విద్యార్థులు బోధినేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- DELHI EXIT POLLS – డిల్లీ ఎగ్జిట్ పోల్స్ 2025
- శాతవాహనలో ముగిసిన వికసిత్ భారత్ జాతీయ సదస్సు
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 05 – 02 – 2025
- JEE MAINS KEY – జేఈఈ మెయిన్ ప్రాథమిక కీ
- GK BITS IN TELUGU 5th FEBRUARY