BIKKI NEWS (OCT. 24) : VIKASITH BHARATH 2047 SEMINAR IN SATAVAHANA UNIVERSITY. శాతవాహన విశ్వవిద్యాలయం, అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో “వికసిత్ భారత్ 2047 ఇండియా విజన్ ఫర్ డెవలప్మెంట్” అనే అంశంపై తేదీ 4, 5 ఫిబ్రవరి 2025లో జరిగే రెండు రోజుల జాతీయ సెమినారుకు సంబంధించిన కరపత్రంను శాతవాహన విశ్వవిద్యాలయం వీసీ కార్యాలయంలో ఉపకులపతి ప్రొ. యు. ఉమేష్ కుమార్ చేతుల మీదుగా గురువారం ఆవిష్కరించడం జరిగింది.
VIKASITH BHARATH 2047 SEMINAR IN SATAVAHANA UNIVERSITY
ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ… భారతదేశ 2047 సంవత్సరం నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే స్థిరమైన అభివృద్ధి అవసరమని సూచించారు.
వికసిత్ భారత్ లక్ష్యాలు అభివృద్ధి, పారదర్శకత అని రిజిస్టార్ ప్రొ. వరప్రసాద్ అన్నారు. సెమినార్ డైరెక్టర్ డాక్టర్. కే. శ్రీవాణి మాట్లాడుతూ… భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 2047 సంవత్సరం నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ తరుణంలో ప్రపంచంలోనే భారతదేశం ఒక గొప్ప అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనేదే ‘వికసిత్ భారత్ 2047 ‘యొక్క ముఖ్య లక్ష్యం అని పేర్కొన్నారు.
ఈ సదస్సుకు ఆచార్యులు, అధ్యాపకులు, పరిశోధకులు మరియు విద్యార్థినీ విద్యార్థులు తమ యొక్క పరిశోధన వ్యాసాలను పంపించాలని విజ్ఞప్తి చేశారు. పరిశోధన వ్యాసాలు అన్నింటిని పరిశీలించి, విశ్లేషించి సెమినార్ ప్రారంభం రోజున ఐ.య ఎస్.బి.యన్. ఆమోదంతో పుస్తకము ముద్రణ చేసి విడుదల చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ ప్రొ. సూరేపెళ్లి సుజాత, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. మహ్మద్ జాఫర్ జరీ, డాక్టర్ కే. పద్మావతి, డాక్టర్ అబ్రహం బాకీ, డాక్టర్ ఉమేరా బేగం, డాక్టర్ నజీముద్దీన్ మునావర్ మరియు విశ్వవిద్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.