ప్రపంచ అర్చరీ టోర్నీ : వెన్నెం జ్యోతి సురేఖ పసిడి గురి

హైదరాబాద్ (ఎప్రిల్‌ – 23) : ఆర్చరీ ప్రపంచ కప్ 2023లో వెన్నం జ్యోతి సురేఖ రెండు పసిడి పథకాలను సాధించింది. వ్యక్తిగత విభాగంలో, మిక్స్డ్ టీం విభాగంలో తొలిసారి రెండు అంతర్జాతీయ స్థాయి స్వర్ణ పథకాలను సురేఖ సాధించింది.

కాంపౌండ్ మిక్స్డ్ టీం విభాగంలో ఓజెస్ ప్రవీణ్ దేవ్ తలే తో కలిసి పసిడి పథకాన్ని సాధించింది.

మహిళల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో ప్రపంచ మూడో ర్యాంకర్ సారా లోపేజ్ పై గెలిచి విశ్వ విజేతగా నిలిచింది. సెమీఫైనల్ లో ప్రపంచ నెంబర్ వన్ ఇలా గిబ్సన్ పై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.