CURRENT AFFAIRS IN TELUGU 20th APRIL 2023

CURRENT AFFAIRS IN TELUGU 20th APRIL 2023

1) రంజి ట్రోఫీ విజేతకు ప్రైజ్ మనీని ఎంతకు పెంచుతూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.?
జ : ఐదు కోట్లు

2) ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ వైస్ చైర్మన్ గా ఎంపికైన భారతీయుడు ఎవరు.?
జ : అజయ్ సింగ్

3) ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఈ ఏడాది ఎన్ని దేశాలు డెంగీ జ్వరం బారిన పడే అవకాశం ఉంది.?
జ : 129

4) జాతీయ సర్వే దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఏప్రిల్ 10

5) ఏ నగరంలో ఒకేసారి 1,134 మంది నృత్యకారులు బిహూ నృత్యం చేస్తూ డోలు వాయిస్తూ వరల్డ్ గిన్నిస్ రికార్డు నెలకొల్పారు.?
జ : గువాహటీ

6) ఏ వైమానిక స్థావరం నుండి రాష్ట్రపతి ద్రౌపది ముర్మ్ సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించారు.?
జ : తేజ్ పూర్ వైమానిక స్థావరం (అసోం)

7) అమెరికా ఆర్థిక వ్యవస్థలో అత్యంత ప్రభావం చూపుతున్న 100 మంది మహిళల జాబితాలో చోటు సంపాదించిన ప్రవాస భారతీయ మహిళలు ఎంతమంది.?
జ : 5గురు

8) టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం (WPI) మార్చి 2023 కు ఎంతగా నమోదయింది.?
జ : 1.34%

9) పాఠశాలల్లో దివ్యాంగులైన విద్యార్థులను గుర్తించడం, వారికి అవసరమైన చదువుల తీరును విశ్లేషించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన యాప్ పేరు ఏమిటి.?
జ : ప్రశస్త్

10) ప్రాజెక్ట్ టైగర్ పథకం కింద దేశంలో తొలి పులుల సంరక్షణ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు.?
జ : జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్