UPSC JOBS : ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2024

న్యూడిల్లీ (సెప్టెంబర్ – 08) : UNION PUBLIC SERVICE COMMISSION ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ -2024 (UPSC – ESE 2024 NOTIFICATION) ప్రకటనను విడుదల చేసింది. దీని ద్వారా దేశ వ్యాప్తంగా.. రైల్వే, టెలికాం, డిఫెన్స్ సర్వీస్ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో 167 ఇంజినీరింగ్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 26వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్.

విద్యార్హతలు: పోస్టును అనుసరించి బీఈ/ బీటెక్. లేదా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) ఇన్స్టిట్యూట్ ఎగ్జామినేషన్స్ ఎ, బి విభాగాలు ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి : 01-01-2024 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా.

ఎంపిక విధానం :
స్టేజ్-1 (ప్రిలిమినరీ ఎగ్జామ్,
స్టేజ్-2 (మెయిన్) ఎగ్జామ్,
స్టేజ్-3 (పర్సనాలిటీ టెస్ట్),
వైద్య పరీక్షలు,
ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: 200/- (మహిళలు/ ఎస్సీ / ఎస్టీ/ పీడబ్ల్యూడీ విభాగాలకు ఫీజు మినహాయింపు)

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26-09-2023.

ప్రిలిమినరీ/ స్టేజ్-1 పరీక్ష తేదీ: 18-02-2024.

వెబ్సైట్: https://www.upsc.gov.in/