BIKKI NEWS (AUG. 15) : UNO INDIAN PERMANENT AMBASSADOR PARVATHANENI HARISH. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత రాయబారిగా తెలుగు వ్యక్తి పర్వతనేని హరీశ్ ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పర్వతనేని హరీశ్ ప్రస్తుతం జర్మనీలో భారత రాయబారిగా పనిచేస్తున్నారు.
UNO INDIAN PERMANENT AMBASSADOR PARVATHANENI HARISH
ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత రాయబారిగా ఉన్న రుచిరా కాంబోజ్ జూన్ లో పదవి విరమణ చేయడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం పర్వతనేని హరీష్ ను ఐరాస లో భారత శాశ్వత రాయబారిగా నియమించింది.
పర్వతనేని హరీష్ హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి గోల్డ్ మెడల్ సాధించాడు.
జి20, జి7, బ్రిక్స్ సమావేశాల నిర్వహణలో కీలక పాత్ర పోషించాడు. అలాగే ఉపరాష్ట్రపతికి ఓ ఎస్ డి గా కూడా పనిచేశారు. త్వరలోనే ఐరాస లో శాశ్వత రాయబారిగా పదవి చేపట్టనున్నారు.