వర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల క్రమబద్ధీకరణకై ధర్నా

హనుమకొండ (జూన్ – 30) : తెలంగాణ రాష్ట్రంలో 13 విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను అందర్నీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ఈరోజు తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలోని (university-contract-lecturers-regularization-issue) యూనివర్సిటీ పరిపాలన భవనం ముందు ధర్నా చేయడం జరిగింది.

ఈ సందర్భంగా తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ చైర్మన్ డాక్టర్ శ్రీధర్ కుమార్ లోధ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 13 విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 1,356 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను అందర్నీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు,

డిగ్రీ కళాశాల కాంట్రాక్ట్ అద్యాపకులు, పాలిటెక్నిక్ కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకుల్ని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. కానీ యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల్ని ఈ రోజు వరకు కూడా రెగ్యులరేషన్ కాకపోవటం బాధాకరమని ఆయనే ఆవేద వ్యక్తం చేశారు. తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులనులందర్నీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జేఏసీ టెక్నికల్ ఇన్చార్జి డాక్టర్ ఎం. సంగీత్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ టి నాగయ్య, డాక్టర్ గడ్డం కృష్ణ, డాక్టర్ మధుకర్ రావు, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ బ్లేస్సి ప్రియాంక, డాక్టర్ డి. సుజాత, డాక్టర్ పుల్లా రమేష్, శశిధర్, డాక్టర్ చీకటి శ్రీనివాస్, డాక్టర్ కల్పన తదితరులు పాల్గొన్నారు.