Home > NATIONAL > UNION CABINET – కేంద్ర కేబినేట్ నిర్ణయాలు

UNION CABINET – కేంద్ర కేబినేట్ నిర్ణయాలు

BIKKI NEWS (SEP. 19) : UNION CABINET DECISIONS ON 18th SEPTEMBER 2024. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం పలు కీలకమైన అంశాలకు ఆమోదం తెలిపింది.

UNION CABINET DECISIONS ON 18th SEPTEMBER 2024

దేశంలో జమిలి ఎన్నికలకు (ఏకకాల ఎన్నికలకు) ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్‌ బుధవారం ఆమో దం తెలిపింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ రూపొందించిన నివేదికను ఈ మేరకు ఆమోదించింది.

శుక్రగ్రహాన్ని అధ్యయనం చేయడం కోసం దాని కక్ష్యలోకి వ్యోమనౌకను పంపించేందుకు చేపట్టనున్న ‘వీనస్‌ ఆర్బటర్‌ మిషన్‌'(శుక్రయాన్‌-1)కు రూ.1,236 కోట్లు కేటాయించింది

పాక్షిక పునర్వినియోగానికి అవకాశం ఉండే నెక్ట్స్‌ జెనెరేషన్‌ లాంచ్‌ వెహికిల్‌(ఎన్జీఎల్వీ)కి సైతం క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంలో భాగంగా కీలకమైన ఎన్జీఎల్వీతో పాటు మూడు డెవలప్‌మెంటల్‌ విమానాలు, ఇతర అవసరమైన సాంకేతికత అభివృద్ధి కోసం రూ.8,240 కోట్లు కేటాయించింది.

చంద్రయాన్‌-4 మిషన్‌కు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఇందుకు రూ.2,104.06 కోట్లు కేటాయించింది.

దేశవ్యాప్తంగా గిరిజనుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చేందుకు గానూ రూ.79,156 కోట్ల వ్యయంతో ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్‌ గ్రామ అభియాన్‌ పథకం అమలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదించింది.

2024-25 రబీ సీజన్‌కు ఫాస్ఫాటిక్‌, పొటాస్సిక్‌(పీ ఆండ్‌ కే) ఎరువుల సబ్సిడీగా రూ.24,474.53 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది.

రైతుల పంటలకు మెరుగైన ధరలు అందేలా చూసేందుకు, నిత్యావసరాల ధరలు స్థిరంగా ఉంచేందుకు రూ.35,000 కోట్ల వ్యయంతో పీఎం-ఆశా పథకాన్ని 2025-26 వరకు కొనసాగించాలని నిర్ణయించింది.

జీవసాంకేతిక విజ్ఞానంలో అధునాతన పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించేందుకు రూ.9,197 కోట్ల వ్యయంతో బయోటెక్నాలజీ రిసెర్చ్‌ ఇన్నొవేషన్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ డెవెలప్‌మెంట్‌(బయో-రైడ్‌) పథకాన్ని ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌, కామిక్స్‌, ఎక్స్‌టెండెడ్‌ రియాలిటీ(ఏవీజీసీ-ఎక్స్‌ఆర్‌) కోసం నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌(ఎన్‌సీఓఈ)ను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు