హైదరాబాద్ (డిసెంబర్ – 21) : భారత్ లోని మూడు చారిత్రక స్థలాలను ప్రపంచ వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చేర్చుతూ యునెస్కో (UNESCO india heritage sites) నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) మంగళవారం ప్రకటించింది.
- మొడేరా సూర్య దేవాలయం (గుజరాత్)
- చారిత్రక నగరం వడ్ నగర్ (గుజరాత్) (మోడీ జన్మస్థలం)
- ఉనాకోటీ రాతి నిర్మాణాలు (త్రిపుర)
వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాకు ఈ మూడు స్థలాలను ప్రతి పాదిస్తూ భారత ప్రభుత్వం పదిహేను రోజుల క్రితం నామినేషన్లు పంపించగా వాటిని యునెస్కో ఆమోదించింది.
ఈ సంవత్సరం ఇప్పటి వరకు మొత్తం ఆరు చారిత్రక ప్రదేశాలు భారత్ నుంచి వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్నాయి.