BIKKI NEWS (MARCH 28) : ఐక్యరాజ్యసమితి పర్యావరణ పథకం విడుదల చేసిన ఆహార వృధా నివేదిక 2024 ప్రకారం (UN FOOD WASTE INDEX 2024) ప్రపంచవ్యాప్తంగా 2022లో 19 శాతం ఆహారం iyiవృధా చేస్తున్నారని ప్రకటించింది. ఇది 100 కోట్ల టన్నుల ఆహరం అని తెలిపింది.
ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 78.3 కోట్ల మంది తీవ్ర ఆకలితో బాధపడుతున్నారని పేర్కొంది. రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం మరింత పెరుగుతుందని నివేదిక స్పష్టం చేసింది.
2030 వరకు ఆహార వృధాను సగానికి తగ్గించాలని ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్యసమితి సూచించింది. 2021తో పోలిస్తే 2022లో ఆహార వృధా చేసే దేశాల సంఖ్య రెట్టింపు అయ్యిందని నివేదికలో పేర్కొన్నారు.
ఈ ఆహార వృధా 60% ఇండ్లు, 28% హోటల్స్, 12% రిటైలర్స్ వద్ద జరుగుతుందని తెలిపింది.