UGC NET 2024 – పరీక్షలు రీషెడ్యూల్

BIKKI NEWS (AUG. 14) : UGC NET 2024 EXAMS DATES RESCHEDULED. యూజీసీ నెట్ జూన్ – 2024 పరీక్షల తేదీలను రీషెడ్యూల్ చేస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటన విడుదల చేసింది.

UGC NET 2024 EXAMS DATES RESCHEDULED

ఆగస్టు 23, 24, 25, 26, 28, 29, 30 మరియు సెప్టెంబర్ 2, 3, 4 వ తేదీలలో షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఆగస్ట్ 26 న జరగాల్సిన పరీక్షను 27 కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మొత్తం 83 సబ్జెక్టులలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్డీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ లకు అర్హత పరీక్షగా యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు.

ఇప్పటికీ ఈ పరీక్షలకు సంబంధించి పరీక్షా కేంద్రాల ఇంటిమేషన్ స్లిప్ లను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు. ఈ పరీక్షలకు సంబంధించి అడ్మిట్ కార్డులను త్వరలోనే విడుదల చేయనున్నారు.

వెబ్సైట్ : https://ugcnet.nta.ac.in/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు