UGC GUIDELINES – ఓపెన్, డిస్టెన్స్ విద్యార్థులకు కీలక సూచనలు

BIKKI NEWS (MARCH 28) : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ మరియు ఆన్లైన్ కోర్సులలో అడ్మిషన్లు పొంది, కోర్సులు పూర్తి చేయాలనుకుంటున్నా విద్యార్థులకు పలు సూచనలు (UGC GUIDELINES FOR OPEN DISTANCE AND ONLINE LEARNING) చేసింది. వీటిని యూజీసీ చైర్మన్ మామిడాల జగదీష్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

1) మీరు ఏ కోర్సులో చదవాలనుకుంటున్నారో, ఏ విద్యాసంస్థలో చదవాలనుకుంటున్నారో ఆ విద్యా సంస్థకు సంబంధించి ఆ ఎడ్యుకేషన్ ఇయర్ లో సంబంధించిన కోర్సుకు యూజీసీ గుర్తింపు ఉందో లేదో చెక్ చేసుకోవాలి.

2) విద్యాసంస్థలకు యూజీసీ గుర్తింపు, లోకల్ యూనివర్సిటీల గుర్తింపు సర్టిఫికెట్లను సంబంధించిన విద్యాసంస్థలు వారో వెబ్సైట్ లో అందుబాటులో ఉంచాలి.

3) సంబంధించిన విద్యాసంస్థలను నో అడ్మిషన్ లేదా డి బార్ క్యాటరింగ్ లో ఉందో లేదో ఈ లింకు (deb.ugc.ac.in) ద్వారా చెక్ చేసుకోవాలి

4) కోర్సు పేరు, కోర్సు కావలసిన క్వాలిఫికేషన్ వెబ్సైట్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

5) సంబంధించిన కోర్సులను ఆన్లైన్ పద్ధతిలో బోధించడానికి అనుమతి పొందినవో లేవో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

6) విద్యార్థులు సంబంధించిన కోర్సుల టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ ను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. యూజీసీ గైడ్లైన్స్ 2020 ఎనెక్షర్ 3 లో వీటి గురించి వివరంగా ఇవ్వడం జరిగింది. (deb.ugc.ac.in)

7) ఏ విద్యా సంస్థ కూడా ప్రాంచైజ్ పద్ధతిలో డిస్టెన్స్/ ఆన్లైన్ కోర్సులను ఆఫర్ చేయరాదు.

8) ఫ్రాంచైజ్ / థర్డ్ పార్టీ ద్వారా కోర్సులను ఆఫర్ చేయరాదు.

9) యుజిసి చేత గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో చేసిన డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు సాధారణ కోర్సులతో సమానంగా అవకాశాలను కల్పిస్తాయి.