గురుకుల సీవోఈ లలో 8, 9 తరగతుల అడ్మిషన్స్

BIKKI NEWS (MARCH 03) : తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల (TSWREIS COE ADMISSIONS for 8th and 9th Classes) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అల్గునూరు, పరిగి, ఖమ్మం, గౌలిదొడ్డి గురుకులాల్లో 2024 – 25 విద్యా సంవత్సరానికి గాను 8వ, 9వ‌ తరగతులలో (ఇంగ్లీషు మీడియం) లో రెగ్యులర్ ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష కొరకు నోటిఫికేషన్ విడుదల అయింది.

తెలంగాణకు చెందిన విద్యార్థినీ విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల అయింది. తెలంగాణ సాంఘీక సంక్షేమ (TSWREIS) సంస్థ ఈ ప్రవేశాలు కల్పిస్తుంది.

కరీంనగర్ జిల్లా – అల్గునూరు (కో ఎడ్యుకేషన్), రంగారెడ్డి జిల్లా – గౌలిదొడ్డి (బాలికల) ప్రతిభా గురుకులాల్లో లలో మాత్రం 9వ తరగతి రెగ్యులర్ ప్రవేశాలు కల్పించనున్నారు.

అలాగే వికారాబాద్ జిల్లా – పరిగి (బాలికల), ఖమ్మం జిల్లా – ఖమ్మం (బాలుర) ప్రతిభా గురుకులాల్లో మాత్రం 8వ తరగతి లో రెగ్యులర్ ప్రవేశాలు కల్పించనున్నారు.

దరఖాస్తు గడువు : ఆన్లైన్ ద్వారా 04-03-2024 నుండి 24-03-2024 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

విద్యార్థుల తల్లిదండ్రుల/సంరక్షకుల సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు రూ.1,50,000/-, పట్టణ ప్రాంత విద్యార్థులకు రూ.2,00,000/-కు మించరాదు.

ఎంపిక విధానం : ఎప్రిల్ – 21- 2024 నాడు జరిగే ప్రవేశ పరీక్షలో కనబరచిన ప్రతిభ మరియు రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులు ఎంపిక చేయబడతారు.

దరఖాస్తు ఫీజు : రూ.100/-

పరీక్ష తేదీ : ఎప్రిల్ – 21 – 2024 ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 1.00 గంటల మద్య

వెబ్సైట్ : https://www.tswreis.ac.in