Home > EMPLOYEES NEWS > DEPARTMENTAL TESTS వాయిదా – TSPSC

DEPARTMENTAL TESTS వాయిదా – TSPSC

హైదరాబాద్ (మే – 04) : తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల డిపార్ట్మెంటల్ టెస్ట్స్ మే – 2024 సెషన్ కు సంబంధించిన పరీక్షలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC POSTPONED DEPARTMENTAL TESTS 2024) వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

షెడ్యూల్ ప్రకారం మే 13 నుండి జరగాల్సిన డిపార్ట్మెంటల్ టెస్ట్స్ లోక్‌సభ ఎన్నికల కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఉద్యోగులు ఎన్నికలకు సంబంధించి విధులలో పాల్గొంటున్న కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

వాయిదా పడిన ఈ పరీక్షలను జూన్ 12 నుండి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు TSPSC తెలిపింది.