BIKKI NEWS (APRIL 04) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జిల్లా స్థాయి పోస్టులకు మరియు భారీ సంఖ్యలో పోస్టులు ఉన్న నోటిఫికేషన్లకు మెరిట్ లిస్టును 1:3 నిష్పత్తిలో విడుదల (Tspsc merit lists in 1:3 ratio) చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు అన్ని నోటిఫికేషనులకు 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే జోనల్, మల్టీ జోనల్ పోస్టులకు మాత్రం 1:2 నిష్పత్తిలోనే విడుదల చేయనున్నారు.
ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో పోస్టులు ఉన్న గ్రూప్ – 4 నోటిఫికేషన్ కు కూడా 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాను విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే గ్రూప్ 4 మెరిట్ లిస్టును కూడా విడుదల చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు షెడ్యూల్ ను విడుదల చేయనున్నట్లు సమాచారం.
★ పోస్టులు మిగిలిపోకుండా
అభ్యర్థులు వేరే పోస్టులకు అర్హత సాధించడంతో ఈ పోస్టులను వదిలిపెట్టి వెళ్లినప్పుడు ఈ జాబితాలో ఉన్న మిగిలిన అభ్యర్థులు మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడానికి వీలు కలుగుతుంది లేకుంటే ఈ పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులుగా మిగిలిపోనున్నాయి. ఈ కారణం చేతనే 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.