TSPSC : మెరిట్ లిస్టు – ర్యాంకుల ఖరారు విధానం

హైదరాబాద్ (సెప్టెంబర్ – 22) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఉద్యోగ నియామక పరీక్షల్లో ప్రతిభ చూపిన అభ్యర్థుల మెరిట్ లిస్ట్ & జనరల్ ర్యాంకు జాబితా తయారీ (TSPSC RANKING SYSTEM CRITERIA) ప్రక్రియపై ప్రకటన వెలువరించింది.

రాతపరీక్షలో ఇద్దరు అభ్యర్థులకు ఒకే మార్కులు వస్తే.. ర్యాంకుల ఖరారు ఎలా అన్నదానిపై వివరణ ఇచ్చింది.

◆ TSPSC RANKING SYSTEM

అభ్యర్థి స్థానికతను పరిగణనలోకి తీసుకుంటుంది.

తర్వాత పుట్టినతేదీ పరిగణనలోకి తీసుకుంటుంది.

అది ఒకటే అయితే పోటీ పరీక్ష సబ్జెక్టులో వచ్చిన మార్కులు (జనరల్ స్టడీస్ పేపర్ మినహా) తీసుకుని ఉన్నత ర్యాంకు ఇస్తుంది.

ఇవీ సమానమైతే అభ్యర్థి విద్యార్హత. పరీక్ష పాసైన ఏడాదిని లెక్కలోకి తీసుకుంటుంది.

అదీ ఒకటే అయితే విద్యార్హత పరీక్షలో అత్యధిక మార్కులు పొందిన అభ్యర్థికి మెరుగైన ర్యాంకు కేటాయిస్తుంది.

అక్కడా సమాన మార్కులుంటే ఉన్నత విద్యార్హత.. తర్వాత అందులో మార్కుల శాతం చూస్తామని తెలిపింది.

వీటన్నింటిపైనా TSPSC నిర్ణయమే అంతిమమని కమిషన్ స్పష్టం చేసింది.