BIKKI NEWS (APRIL 11) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ భూగర్భ జల వనరుల శాఖలో భర్తీ చేయనున్న గెజిటెడ్ ఆఫీసర్ల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు ఎంపికైన అభ్యర్థుల ఫలితాలను విడుదల (TSPSC GWD GAZETTED OFFICERS CERTIFICATE VERIFICATION RESULT) చేసింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్లను చెక్ చేసుకోవచ్చు.
1:2 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థులు ఏప్రిల్ 18 నుండి 20 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకొని, ఏప్రిల్ 20న ఉదయం 10.30 గంటలకు హైదరాబాదులోని నాంపల్లిలో ఉన్న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరు కావాల్సి ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భూగర్భ జలవనరులు శాఖలో 32 గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులను, 25 నాన్ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులను కలిపి మొత్తం 57 పోస్టులు భర్తీ చేయనున్నారు.