Home > JOBS > TGPSC > TSPSC > TSPSC GROUP – 1 పరీక్షకు కీలక నిబంధనలు విడుదల

TSPSC GROUP – 1 పరీక్షకు కీలక నిబంధనలు విడుదల

BIKKI NEWS (MAY 30) : TSPSC GUIDELINES FOR GORUP – 1 PRELIMS EXAM. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూపు-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి కీలకమైన నిబంధనలు విడుదల చేసింది. అభ్యర్థులు ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు.

జూన్ – 1 నుంచి అభ్యర్థులు తమ హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని TGPSC తెలిపింది.

జూన్‌ 9న ఉదయం 9.00 గంటల నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారని.. 10 గంటలు దాటితే లోనికి అనుమతించబోమని అధికారులు తెలిపారు. ఉదయం 9.30 నుంచి అభ్యర్థుల బయోమెట్రిక్‌ తీసుకుంటామన్నారు. పరీక్ష ప్రారంభానికి ముందుగానే అభ్యర్థులకు ఓఎంఆర్‌ షీట్లను ఇస్తారని, బుక్‌లెట్‌లను 10.30కు బెల్‌ మోగిన తర్వాతే తెరవాల్సి ఉంటుందని చెప్పారు.

ఈసారి ఓఎంఆర్‌ షీట్‌లో అభ్యర్థి ఫొటోను ముద్రిస్తున్నారు. దీంతోపాటు.. అభ్యర్థి పేరు, హాల్‌టికెట్‌ నంబర్‌, ఇతర వివరాలు కూడా ఓఎంఆర్‌ షీట్‌పై ఉంటాయి. దీని వల్ల హాల్‌టికెట్‌ బబ్లింగ్‌లో జరిగే పొరపాట్లకు అడ్డుకట్ట పడుతుందని టీజీపీఎస్సీ భావిస్తోంది.

★ ముఖ్య సూచనలు

పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందుగానే అభ్యర్థులు కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.

అభ్యర్థులు బూట్లను ధరించి పరీక్షకు రాకూడదు. చెప్పులను మాత్రమే ధరించాలి.

అభ్యర్థులు చేతులకు మెహిందీ, తాత్కాలిక టాటూస్ ను వేసుకోకూడదు.

పరీక్ష కేంద్రంలోకి క్యాలిక్యులేటర్లు, పేపర్లు, సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు, పెన్‌డ్రైవ్‌లు, బ్లూటూత్‌ పరికరాలు, చేతిగడియారం, ఎక్కాల పుస్తకం, లాగరిథమ్‌ పుస్తకం, పర్సు, హ్యాండ్‌బ్యాగ్‌, రైటింగ్‌ పాడ్స్‌, ఆభరణాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, రికార్డింగ్‌ పరికరాలకు అనుమతి ఉండదు.

విలువైన వస్తువులను భద్రపరిచే ఏర్పాట్లు పరీక్ష కేంద్రాల్లో ఉండవు.

పరీక్ష ప్రారంభమైన తర్వాత ప్రతి 30 నిమిషాలకు ఒకసారి బెల్‌ మోగించి లేదా ఇన్విజిలేటర్‌ ద్వారా సమయాన్ని చెబుతారు.