హైదరాబాద్ (ఆగస్ట్ – 05) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఆగస్టు 29, 30వ తేదీలలో GROUP 2 EXAM ను నిర్వహించనుంది.
ఈ నేపథ్యంలో GROUP 2 SYLLABUS & EXAM PATTERN గురించి తెలుసుకుందాం…
★ GROUP 2 EXAM PATTERN
గ్రూప్ 2 పరీక్ష మొత్తం 4 పేపర్లు కలిగి ఉంటుంది. ప్రతి పేపర్ కు 150 మార్కుల చొప్పున మొత్తం 600 మార్కులకు ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ఉంటుంది.
ప్రతి పేపర్ కు 2.30 గంటల సమయం ఉంటుంది. నెగెటీవ్ మార్కింగ్ విధానం లేదు, ఇంటర్వ్యూ లేదు.
పేపర్ – 1 (జనరల్ స్టడీస్ – ఎబిలిటీస్ ) : 150 మార్కులు
పేపర్ – 2 (చరిత్ర – పాలీటి – సొసైటీ) – 150 మార్కులు
పేపర్ – 3 (ఎకానమీ & డెవలప్మెంట్) – 150 మార్కులు
పేపర్ – 4 (తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఆవిర్భావం) – 150 మార్కులు