GROUP 1 PRELIMS రద్దు – హైకోర్టు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 23) : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ (tspsc group 1 prelims exam cancelled by high court) సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.

జూన్ 11న జరిగిన పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని TSPSCని కోర్టు విస్పష్టంగా ఆదేశించింది.

ఈ పరీక్ష సందర్భంగా బయోమెట్రిక్ వివరాలు తీసుకోకపోవడం, హాల్ టికెట్ నెంబర్ లేకుండా OMR షీటు ఇవ్వడంపై పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా.. పరీక్షను రద్దు చేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.

కాగా పేపర్ లీక్ కారణంగా గతంలోనూ గ్రూప్-1 రద్దవగా.. తాజాగా రెండోసారి రద్దు కావడం విశేషం