BIKKI NEWS (MARCH 14) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులకు హల్ టికెట్ల వారీగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్(TSPSC AEE POSTS CERTIFICATE VERIFICATION SCHEDULE) ను విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా చెక్ చేసుకోవచ్చు.
మార్చి 18 నుండి 22వ తేదీ వరకు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, జేఎన్టీయూ కూకట్‌పల్లి, హైదరాబాద్ నందు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ను విభాగాల వారీగా చేయనున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా అగ్రికల్చరల్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ వంటి విభాగాలలో పోస్టులను భర్తీ చేయనున్న విషయం తెలిసిందే
కింద ఇవ్వబడిన చెక్ లిస్ట్ లోని ధృవపత్రాలను రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో మరియు ఒరిజినల్ ధ్రువపత్రాలతో నిర్దేశించబడిన తేదీలో అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయకపోయినా, నిర్దేశించిన తేదీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరు కాకపోయినా వారి యొక్క అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకొనబడరు.