TSPSC : అకౌంట్స్ ఆఫీసర్ ప్రిలిమినరీ ‘కీ’ విడుదల

హైదరాబాద్ (ఆగస్టు 22) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) మున్సిపల్ డిపార్ట్మెంట్ లో 78 అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాల నియామక పరీక్ష ప్రిలిమినరీ ‘కీ’ని (TSPSC ACCOUNTS OFFICER EXAM PRELIMINARY KEY) సోమవారం విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేసి చెస్ చేసుకోవచ్చు.

ప్రాథమిక ‘కీ’పై ఏలాంటి అభ్యంతరాలు ఉన్న ఆగస్టు 23 నుంచి 25 సాయంత్రం 5 గంటల వరకు తెలియజేయాలని సూచించారు. అభ్యంతరాలకు సంబంధించిన ఆధారాలను పీడీఎఫ్ ఫార్మాట్లో సమర్పించాలని చెప్పారు.

అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు సెప్టెంబర్ 20 సాయంత్రం 5 గంటల వరకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. ఈ నెల 8న అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షను ఆన్లైన్ పద్దతిలో నిర్వహించగా, 12,302 మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే.

వెబ్సైట్ : https://www.tspsc.gov.in