DOLLAR vs INDIAN RUPEE : కనిష్ఠానికి పడిన రూపాయి విలువ

హైదరాబాద్ (ఆగస్టు 22) : డాలర్ తో రూపాయి మారకం విలువ చారిత్రక కనిష్ట స్థాయికి పడిపోయింది సోమవారం నాడు రికార్డు స్థాయిలో డాలర్ తో రూపాయి మారకం (dollar vs indian rupee) విలువ 83.13 రూపాయలకు పడిపోయింది.

అంతర్జాతీయంగా డాలర్ కు డిమాండ్ పెరగడంతో అనేక దేశాల కరెన్సీలు ఒత్తిడికి గురయ్యాయి. దీంతో భారత్ కరెన్సీ కూడా ఒత్తిడికి గురై కనిష్టానికి పడిపోయింది.