Home > JOBS > TELANGANA JOBS > TSNPDCL JOBS : జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు

TSNPDCL JOBS : జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు

వరంగల్ (ఎప్రిల్‌ – 27) : ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSNPDCL) 100 – జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల (junior assistant cum computer operator jobs) భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ కొలువులను భర్తీ చేయనుంది. వరంగల్ కరీంనగర్ ఖమ్మం నిజామాబాద్ ఆదిలాబాద్ విద్యుత్ సర్కిలలో ఈ 100 పోస్టులను భర్తీ చేయనున్నారు

◆ అర్హతలు : బిఎ/ బిఎస్సి/ బీకాం తో కంప్యూటర్ అప్లికేషన్/ ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికెట్ కోర్స్ ఉత్తీర్ణులై ఉండాలి.

◆ వయోపరిమితి : 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ఆధారంగా సడలింపు కలదు టీఎస్ ట్రాన్స్ కో, టీఎస్ ఎన్పీడీసీఎల్, టిఎస్ ఎస్పీడీసీఎల్ లో పనిచేస్తున్న ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరి విషయంలో ఉద్యోగం చేరినప్పటి వయసును పరిగణలోకి తీసుకుంటారు.

◆ ఎంపిక విధానం : రాత పరీక్ష అనుభవం ఆధారంగా.

◆ రాత పరీక్ష విధానం : ఓఎంఆర్ – ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ 40 మార్కులు, కంప్యూటర్ అవేర్నెస్ 20 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొపిసియన్సీ అండ్ జనరల్ నాలెడ్జ్ 20 ప్రశ్నలు ఉంటాయి.

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్

◆ దరఖాస్తు గడువు : ఏప్రిల్ 29 – 2023

◆ దరఖాస్తు సవరణ తేదీలు : మే 2 నుండి 5 వరకు

◆ పరీక్ష తేదీ : జూన్ – 04 – 2023

◆ వెబ్సైట్ : https://tsnpdcl.cgg.gov.in/TSNPDCLWEB20/#!/home14asdfrt789.rps