TET 2024 FULL NOTIFICATION – టెట్ పూర్తి నోటిఫికేషన్

BIKKI NEWS (MARCH 23) : తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష ( TS TET 2024 FULL NOTIFICATION) కు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ విడుదల అయింది.

టెట్‌ పేపర్‌ 1కి డీఈడీ అర్హత ఉండాలి. ఇంటర్‌లో జనరల్‌ అభ్యర్థులకు 50%, ఇతరులకు 45% మార్కులు తప్పనిసరిగా ఉండాలి.. ఒకవేళ అభ్యర్థులు 2015లోపు డీఈడీలో చేసిఉంటే జనరల్‌ అభ్యర్థులకు ఇంటర్‌లో 45%, ఇతరులకు 40% మార్కులు ఉన్నా అర్హులే.

అర్హతలు : టెట్‌ పేపర్‌-2కి డిగ్రీ, బీఈడీ ఉండాలి. జనరల్‌ అభ్యర్థులకు డిగ్రీలో 50%, ఇతరులకు 45% మార్కులు ఉండాలి. 2015లోపు బీఈడీ అయితే జనరల్‌కి 50%, ఇతరులకు 40% మార్కులు ఉన్నా అర్హులే. సర్వీస్‌ టీచర్లు కూడా టెట్‌ రాయవచ్చు.

ఫీజు వివరాలు : ఈసారి దరఖాస్తుకు ఫీజు భారీగా పెంచింది. గతంలో ఒక పేపర్‌ రాస్తే ₹ 200 రుసుము ఉండగా… దాన్ని ₹ 1,000 పెంచింది. రెండు పేపర్లు రాస్తే గతంలో ₹ 300 రుసుము ఉండగా.. దాన్ని ₹ 2,000కు పెంపుదల చేసింది.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : మార్చి 27 నుంచి ఎప్రిల్ 10 తేదీ వరకు

హాల్‌టికెట్లను డౌన్లోడ్‌ : మే – 15 నుంచి

పరీక్ష విధానం : కంప్యూటర్‌ ఆధారిత విధానంలో

సిలబస్ : SYLLABUS

పరీక్షల తేదీలు : మే 20 నుంచి జూన్‌ 3వ తేదీ వరకు (పేపర్‌-1 ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, పేపర్‌-2 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు)

పరీక్ష ఫలితాలు : జూన్‌ 12న

వెబ్సైట్ : https://schooledu.telangana.gov.in