BIKKI NEWS (MAY 05) : TS RTC JOBS RECRUITMENT THROUGH TSLPRB – టి ఎస్ ఆర్ టి సి లో 3000 డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాల భర్తీని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా చేయాలని ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
దాదాపు 3,000 డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాల భర్తీకై ఆర్థిక శాఖ ఆమోదం కోసం ఫైల్ పెండింగ్ లో ఉంది. ఫైల్ ఆమోదం పొందిన తరువాత నోటిఫికేషన్ విడుదల కానుంది.
అయితే గతంలో ఆర్టీసీ ఉద్యోగాలను అంతర్గతంగా రిక్రూట్మెంట్ చేసేవారు. దీనిపై పలు అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఆర్టీసీ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.