ఈసీ ఒప్పుకుంటేనే 31న జెన్కో ఏఈ, కెమిస్ట్ పరీక్ష

BIKKI NEWS (MARCH 25) : తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (TS GENCO CHEMIST and AE JOBS EXAM DATE)లో అసిస్టెంట్ ఇంజనీర్లు, కెమిస్ట్ ఉద్యోగాల భర్తీ కోసం మార్చి 31న జరగాల్సిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సంస్థ యాజమాన్యం అనుమతి కోరింది.

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం జారీ చేసే ఆదేశాల ఆధారం గా షెడ్యూల్ ప్రకారం 31న పరీక్ష నిర్వహణపై తమ నిర్ణయాన్ని సంస్థ వెబ్సైట్ ద్వారా అభ్యర్థులకు తెలియజేస్తామని జెన్కో తెలిపింది.

ఈనెల 23 నుంచి వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లను అందుబాటులో ఉంచాల్సి ఉండగా, ఈసీ అనుమతి కోసం జెన్కో ఎదురు చూస్తోంది.

వెబ్సైట్ : https://tsgenco.co.in/TSGENCO/home.do