హైదరాబాద్ (అక్టోబర్ – 05) : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ (TS GENCO CHEMIST JOBS RECRUITMENT NOTIFICATION) లో 60 కెమిస్ట్ (CHEMIST) ఉద్యోగాలను ప్రత్యక్ష, రెగ్యులర్ నియామకాల పద్ధతిలో భర్తీ చేసేందుకు సంస్థ యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణతో పాటు ఇప్పటికే ఉన్న పాత విద్యుత్ కేంద్రాల అవసరాల కోసం ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
★ ఖాళీల వివరాలు :
కెమిస్ట్ – 60
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : అక్టోబర్ – 07 నుండి 29 వరకు
హల్‌టికెట్ల విడుదల : పరీక్షకు వారం ముందు
పరీక్ష తేదీ : డిసెంబర్ – 03 – 2023
అర్హతలు : ప్రథమ శ్రేణిలో MSc Chemistry/ MSc Environmental Sciences, డిగ్రీలో ఒక సబ్జెక్టుగా కెమిస్ట్రీ చదివి ఉండాలి
వయోపరిమితి : 18 – 44 సంవత్సరాల మద్య ఉండాలి (రిజర్వేషన్ ఆధారంగా సడలింపు కలదు)
దరఖాస్తు ఫీజు : 700/- (SC, ST, BC, EWS, PH లకు 400/-)
ఎంపిక విధానం : రాత పరీక్ష (100 మార్కులకు) ఆధారంగా
వేతన స్కేల్ : 65,600 -1,,31,220