TS GENCO JOBS : 339 ఏఈ ఉద్యోగాల పూర్తి నోటిఫికేషన్ & సిలబస్

హైదరాబాద్ (అక్టోబర్ – 05) : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ(TS GENCO AE JOBS RECRUITMENT NOTIFICATION)లో 339 అసిస్టెంట్ ఇంజనీర్(AE) ఉద్యోగాలను ప్రత్యక్ష, రెగ్యులర్ నియామకాల పద్ధతిలో భర్తీ చేసేందుకు సంస్థ యాజమాన్యం ప్రకటన జారీచేసింది.

రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణతో పాటు ఇప్పటికే ఉన్న పాత విద్యుత్ కేంద్రాల అవసరాల కోసం ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

★ ఖాళీల వివరాలు :

ఏఈ(ఎలక్ట్రికల్) పోస్టులు 187
ఏఈ(మెకానికల్) పోస్టులు 77
ఏఈ(ఎలక్ట్రానిక్స్) పోస్టులు 25
ఏఈ(సివిల్) పోస్టులు 50

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : అక్టోబర్ – 07 నుండి 29 వరకు

హల్‌టికెట్ల విడుదల : పరీక్షకు వారం ముందు

పరీక్ష తేదీ : డిసెంబర్ – 03 – 2023

అర్హతలు : సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ కలిగిన అభ్యర్థులు

వయోపరిమితి : 18 – 44 సంవత్సరాల మద్య ఉండాలి (రిజర్వేషన్ ఆధారంగా సడలింపు కలదు)

దరఖాస్తు ఫీజు : 700/- (SC, ST, BC, EWS, PH లకు 400/-)

ఎంపిక విధానం : రాత పరీక్ష (100 మార్కులకు) ఆధారంగా

వేతన స్కేల్ : 65,600 -1,,31,220

పూర్తి నోటిఫికేషన్ & సిలబస్ : DOWNLOAD PDF FILE

వెబ్సైట్ : https://tsgenco.co.in