BIKKI NEWS (JULY 05) : Trump Signed on One Big Beautiful Bill. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పన్నుల్లో కోతలు, వ్యయ నియంత్రణల కోసం తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు. దీంతో ఈ బిల్లు చట్ట రూపం దాల్చింది.
Trump Signed on One Big Beautiful Bill.
ఈ చట్టంతో అందరికీ లబ్ధి జరుగుతుందని, సాయుధ బలగాల నుంచి మొదలు రోజూవారీ కార్మికుల వరకు కొత్త చట్టం మద్దతుగా ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికా చరిత్రలోనే తమ ప్రభుత్వం అతిపెద్ద పన్నుకోత, వ్యయకోత, సరిహద్దు భద్రతలో అతిపెద్ద పెట్టుబడి సాధించిందని పేర్కొన్నారు
వన్ బిగ్ బ్యూటీఫుల్ బిల్లు ఆర్థిక, పన్ను, వలస విధానాల చట్టం అమెరికా రాజకీయాలతోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అమెరికాలో కార్పొరేట్ కంపెనీలు, ఉన్నత ఆదాయ వర్గాలు, టిప్/ఓవర్‌టైమ్ వేతనదారులకు ఇది లాభదాయకమైనప్పటికీ తక్కువ ఆదాయ గల కుటుంబాలు, వలసదారులు, పునరుత్పాదక రంగం నష్టపోనున్నాయని నిపుణులు అభిప్రాయం.
ముఖ్యంగా లక్షలాది మంది అమెరికన్లు ఆరోగ్య బీమా కోల్పోనున్నారని చెబుతున్నారు..
సుమారు 1.2 కోట్ల మంది తమ వైద్య బీమా కోల్పోయే ప్రమాదం ఉంది.
కొన్ని రాష్ట్రాల్లో అక్రమ వలసదారులకు మెడికెయిడ్ సేవలు నిలిపివేయడం, లింగ మార్పు చికిత్సలకు నిధులను కూడా నిలిపివేయనున్నారు.
ఈ బిల్లులో సరిహద్దు గోడ నిర్మాణానికి 46 బిలియన్ డాలర్లు, వలసదారుల నిర్బంధ కేంద్రాల విస్తరణకు 45 బిలియన్ డాలర్లు, సిబ్బంది శిక్షణ, నియామకానికి 30 బిలియన్ డాలర్లు కేటాయించారు.
Remittance 1%
ఎన్నారైలు 2026 నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 1 శాతం పన్ను పడనుంది. రెమిటెన్స్ ట్యాక్స్ ద్వారా అమెరికాకు కేవలం ప్రవాస భారతీయుల ద్వారానే రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరనుంది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్