BIKKI NEWS (SEP. 10) : Tourism Courses Admissions in NITHM. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ లో 2024 – 25 విద్యా సంవత్సరం కొరకు పర్యాటక కోర్సులలో అడ్మిషన్స్ కొరకు దరఖాస్తులను కోరుతూ ప్రకటన విడుదల చేశారు.
Tourism Courses Admissions in NITHM
తెలంగాణ ప్రభుత్వం ఆమోదిత నిధమ్‌లో ఇంటర్, డిగ్రీలో బీఎస్సీ, బీబీఏ, ఎంబీఏ అడ్మిషన్ల ప్రక్రియ కోసం విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
టూరిజం, హాస్పిటాలిటీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీల్లో పనిచేసే అవకాశం లభిస్తుందని వివరించారు. క్యాంపస్ ఇంటర్వ్యూలతో పాటు దేశంలోని హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో అనేక అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
మరింత సమాచారం కోసం 9553700034, 9553700035 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.