BIKKI NEWS (OCT. 09) : TODAY NEWS IN TELUGU on 9th OCTOBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 9th OCTOBER 2024
TELANGANA NEWS
నేడే సీఎం చేతుల మీదుగా ఎల్బీ స్టేడియంలో DSC 2024 నియామక పత్రాలు అందజేత
అక్టోబర్ 10న ట్యాంక్ బండ్‌పై 10 వేల మందితో సద్దుల బతుకమ్మ వేడుకలు : సీఎస్ శాంతికుమారి
తెలంగాణలో మరో రెండురోజులు కొనసాగనున్న వానలు.
తెలంగాణకు ఎస్‌జీ గ్రూప్.. 1,000 మందికి ఉద్యోగావకాశాలు – మంత్రి శ్రీధర్ బాబు
ఒకటో తేదీన రావాల్సిన జీతాలు.. 8వ తేదీ వచ్చినా ఇవ్వకపోవడం దుర్మార్గమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు.
గ్యారెంటీల పేరుతో కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, ఆ విషయాన్ని హర్యానా ప్రజలు గ్రహించారు అని కేటీఆర్ తెలిపారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయండి.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన హరీశ్‌రావు
ANDHRA PRADESH NEWS
నయనశోభితం శ్రీవారి గరుడ సేవ.. ఏడుకొండలకు తరలివచ్చిన భక్తకోటి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ఏయూలో కలకలం మరియు ర్యాగింగ్‌లో టీడీపీ నాయకుల కుమారులు : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్
పవన్ కల్యాణ్‌ను సీఎం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది.. సీపీఎం నేత సంచలన వ్యాఖ్యలు
కొవ్వొత్తులకే రూ.23 కోట్లా.. రాష్ట్రం మొత్తం దీపావళి చేశారా? బుడమేరు వరద సాయం లెక్కలపై వైసీపీ సెటైర్లు
ధర్మవరం సీఐ తల్లి కిడ్నాప్.. 10 రోజుల తర్వాత మృతదేహం లభ్యం
మహాలక్ష్మి అలంకారంలో దర్శనం ఇచ్చిన ఇంద్రకీలాద్రి కనక దుర్గమ్మ
NATIONAL NEWS
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపు.
హర్యానాలో ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయ్.. ఫలితాలను అంగీకరించబోం : కాంగ్రెస్
జమ్ము కశ్మీర్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నది నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా తాజాగా ప్రకటించారు. ఒమర్ అబ్దుల్లా నే ముఖ్యమంత్రి అని ప్రకటించారు.
హర్యానాలో ఫలితాల డేటా అప్‌లోడింగ్‌మరియు ఈసీ పై కాంగ్రెస్ అనుమానాలు
జాతీయ రహదారులపై మరిన్ని సౌకర్యాలు.. హమ్‌సఫర్ పాలసీని ప్రారంభించిన నితిన్ గడ్కరీ
అట్టహాసంగా జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుక.. ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము
ప్రభుత్వరంగ టెలికం సంస్థ ‘బీఎస్‌ఎన్‌ఎల్’ సేవల్లో నాణ్యత లోపించడంపై పార్లమెంట్ కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
రాష్ట్ర అసెంబ్లీకి ఐదుగురు సభ్యుల్ని నామినేట్ చేసే అధికారం ఎల్జీకి ఉండటం జమ్మూకాశ్మీర్ లో రాజకీయంగా కీలకంగా మారింది.
భారతీయ రైల్వేలో అధికారుల పోస్టుల భర్తీకి పాత పద్ధతినే అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష (సీఎస్సీ), ఇంజినీరింగ్ సర్వీసెస్ పరీక్ష (ఈఎస్సీ)ల ద్వారా రైల్వే అధికారులను ఎంపిక చేయనున్నది.
ఈకామర్స్ సంస్థ అమెజాన్‌లో ఇకపై ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను విక్రయించనున్నారు. కిండర్‌గార్టెన్ నుంచి 12వ తరగతి వరకు, అలాగే యూపీఎస్సీ అభ్యర్థుల కోసం అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో అధీకృత విక్రేతల ద్వారా ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను విక్రయించనున్నట్టు ఆ సంస్థ సోమవారం వెల్లడించింది.
INTERNATIONAL NEWS
కృత్రిమ న్యూరో నెట్‌వర్క్ ద్వారా మెషీన్ లెర్నింగ్‌కు సంబంధించిన వ్యవస్థీకృత ఆవిష్కర‌్తలు జాన్ జే హోప్‌ఫీల్డ్, జెఫరీ ఈ హింటన్ లకు ఈ ఏడాది ఫిజిక్స్ నోబెల్ బహుమతి ప్రకటించారు.
హిజ్‌బొల్లా కమాండర్ సుహేల్ హుస్సెన్ హతమైనట్లు ఇజ్రాయిల్ రక్షణ దళాలు పేర్కొన్నాయి. సోమవారం రాత్రి జరిగిన దాడిలో అతను చనిపోయినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది.
మాపై దాడులు చేస్తే ప్రతీకార దాడులు తప్పువు.. ఇజ్రాయెల్‌కు ఇరాన్ హెచ్చరిక
అధ్యక్షురాలిగా గెలిస్తే నేను పుతిన్‌ను కలవను : కమలా హారిస్
భావ ప్రకటనా స్వేచ్ఛ, ఆయుధ హక్కుకు మద్దతునిచ్చే పిటిషన్‌పై సంతకం చేసే నమోదిత ఓటర్లు ప్రతి ఒక్కరికీ 47 డాలర్ల చొప్పున ఇవ్వనున్నట్టు ఎలాన్ మస్క్ ప్రకటించారు.
సౌర విద్యుత్తు ఉత్పత్తి కోసం రైల్వే ట్రాక్‌పై తొలిసారి రిమూవబుల్ సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని స్విట్జర్లాండ్ ప్రభుత్వం నిర్ణయించింది.
BUSINESS NEWS
లాభాల్లో ముగిసిన మార్కెట్లు
సెన్సెక్స్ : 81,635 (585)
నిఫ్టీ : 25,013 (217)
మెటా ఆధీనంలోని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ సేవల్లో అంతరాయం ఏర్పడింది.
SPORTS NEWS
నేడు ఐసీసీ మహిళల టీట్వంటీ వరల్డ్ కప్ 2024 లో భారత జట్టు శ్రీలంక తో తలపడనుంది.
బంగ్లాదేశ్ తో రెండో టీట్వంటీ లో టీమిండియా తలపడనుంది.
హర్యానాలోని జులానా స్థానం నుంచి పోటీ చేసిన భారత స్టార్ రెజ్లర్, కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫొగాట్ విజయం సాధించారు.
షూటింగ్ జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్.. భారత్‌కు అగ్రస్థానం
స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ రిటైర్మెంట్
సీపీఎల్ ఫైనల్‌లో సెయింట్ లూసియా కింగ్స్.. 6 వికెట్ల తేడాతో గయానా అమెజాన్ వారియర్స్‌పై గెలిచి టైటిల్ కైవసం చేసుకుంది.
EDUCATION & JOBS UPDATES
అక్టోబర్ 15, 16 వ తేదీలలో తెలంగాణ ఐసెట్ స్పాట్ కౌన్సెలింగ్
ITBP లో పదోతరగతి తో 545 కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగాలు
GATE 2025 దరఖాస్తు గడువు అక్టోబర్ 11 వరకు పొడిగింపు
త్వరలోనే విద్యుత్ శాఖలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ – భట్టి
రైల్వే లో 41,500 ఉద్యోగాలకు పరీక్షల తేదీ లు వెల్లడి.
బీసీ గురుకులాల్లో ఇంటర్ తర్వాత నేరుగా ఇంటర్ – పొన్నం