BIKKI NEWS (OCT. 08) : TODAY NEWS IN TELUGU on 8th OCTOBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 8th OCTOBER 2024
TELANGANA NEWS
వరద నష్టం పనులకు రూ.11,713.49 కోట్లు విడుదల చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గారి అధ్యక్షతన ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరుగుతున్న వామపక్ష తీవ్రవాద ప్రభావిత (LWE) రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
బతుకమ్మ, దసరా పండుగలకు 6304 ప్రత్యేక బస్సులు : టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్
అలయ్ – బలయ్ ఒక సాంస్కృతిక కార్యక్రమమని, అన్ని పార్టీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేదని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ నెల 13వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నారు.
తెలంగాణలో నేడు, రేపు మోస్తరు వర్షాలు..
సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : డిప్యూటీ సీఎం భట్టి
సెక్రటేరియట్ ఎఫ్‌టీఎల్‌లో ఉంటే లేని ఇబ్బంది.. పేదల ఇండ్లు ఉంటే ఏంటి?: అసదుద్దీన్ ఒవైసీ
5 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్.. దసరా ముందురోజు భూమి పూజ: డిప్యూటీ సీఎం
ANDHRA PRADESH NEWS
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
ఏపీలో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 10 నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు కు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
వైభవంగా సాగుతున్న బ్రహ్మోత్సవాలు.. కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చిన మలయప్ప స్వామి
నేత్రపర్వంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. బకాసుర వధ అలంకారంలో దర్శనమిచ్చిన తిరుమలేశుడు
ఏపీలోని ఆంధ్రా యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. అసభ్యకరంగా డ్యాన్సులు చేయాలంటూ ఫస్టియర్ విద్యార్థినులపై కొంతమంది సీనియర్లు ఇబ్బంది పెట్టారు. అంతేకాకుండా వాటిని వీడియోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో కూడా పెట్టారు. ర్యాగింగ్ అంశం బయటకు రావడంతో స్పందించిన కాలేజీ యాజమాన్యం చర్యలు చేపట్టింది.
NATIONAL NEWS
తన ఆరోగ్యం పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. అస్వస్థత వార్తలను ఖండించిన రతన్ టాటా
జార్ఖండ్‌లో ఎన్నార్సీని అమలు చేస్తాం: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వచ్చారు.
దేశంలో వామపక్ష తీవ్రవాదం చివరి దశలో ఉన్నట్లు కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు. 2026 మార్చి నాటికి దేశం ఆ సమస్య నుంచి విముక్తి కానున్నట్లు ఆయన వెల్లడించారు
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం సంభవించింది. బీర్‌భూమ్ జిల్లాలోని ఓ బొగ్గు గనిలో సోమవారం భారీ పేలుడు సంభవించి 7గురు మరణించారు.
మణిపూర్‌లో భారీగా ఆయుధాలు లభ్యం.. తనిఖీల సందర్భంగా పోలీసులు స్వాధీనం
ఐఏఎఫ్ కోరిన దానికి మించి సౌకర్యాలు కల్పించాం: తమిళనాడు సీఎం ఎంకే స్థాలిన్
INTERNATIONAL NEWS
పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌లో నరమేథానికి ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ సోమవారం పేర్కొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీ నుంచి బ్రిటన్ రాజధాని లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని డెన్మార్క్‌కు మళ్లించారు. ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురి కావడం దీనికి కారణమని పేర్కొంది.
మైక్రో ఆర్ఎన్ఏను ఆవిష్కరించిన విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు వైద్య శాస్త్రం లో ఈ ఏడాది నోబెల్ బహుమతి ప్రకటించారు.
కరాచీ విమానాశ్రయం వద్ద భారీ పేలుడు.. చైనీయులే లక్ష్యంగా దాడి
BUSINESS NEWS
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ : 81,050 (-638)
నిఫ్టీ : 24,796 (-219)
బంగారం ధర రూ.78,700/- లతో జీవిత కాల గరిష్టానికి చేరింది.
SPORTS NEWS
నెదర్లాండ్స్ ఫుట్‌బాల్ దిగ్గజం జొహన్ నీస్కెన్స్ కన్నుమూశాడు. డచ్ జట్టుకు ఆడిన గొప్ప మిడ్‌ఫీల్డర్లలో ఒకడైన జొహన్ 73 ఏండ్ల వయసులో మరణించాడు
మహిళల టీ20 వరల్డ్ కప్‌లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్ సౌతాఫ్రికా ను ఓడించింది.
సెయింట్ లూసియా కింగ్స్ జట్టు చరిత్ర సృష్టించింది. కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో తొలిసారి చాంపియన్‌గా అవతరించింది.
చైనా ఓపెన్ టెన్నిస్2024 మహిళల సింగిల్స్ విజేతగా కోకో గాఫ్ నిలిచింది.
EDUCATION & JOBS UPDATES
టీజీ ఎప్‌సెట్ బైపీసీ అభ్యర్థులకు ఫార్మా కోర్సుల్లో కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది.
PJTSAU – వివిధ వ్యవసాయ డిగ్రీ కోర్సులకు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.
BAMS, BHMS, BUMS, NYMS కోర్సుల్లో అడ్మిషన్స్ కొరకు కాళోజీ నారాయణ రావు హెల్త్ వర్శిటీ కౌన్సెలింగ్ షెడ్యూల్.