Home > TOP NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 08 – 02 – 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 08 – 02 – 2025

BIKKI NEWS (FEB. 08) : TODAY NEWS IN TELUGU on 8th FEBRUARY 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 8th FEBRUARY 2025

TELANGANA NEWS

వారంలో స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్. మార్చి 18 వరకు ఎన్నికలు పూర్తి.

కులగణన ఆధారంగా స్థానిక సంస్థలలో సీట్ల రిజర్వేషన్లు – సీఎం

మార్గదర్శి కేసులో ఆర్.బి.ఐ తీరుపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి

మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదంటూ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు

మీసేవ కేంద్రాలలో నూతన రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అలాగే పాత రేషన్ కార్డులో అభ్యర్థుల తొలగింపు మరియు జత చేయడం కూడా చేస్తున్నారు.

తెలంగాణలో కృష్ణా నదిపై మూడు ఫ్లోటింగ్ జెట్టీలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది

ఫిబ్రవరి 13న సరోజినీ నాయుడు జయంతిని ఇంగ్లీష్ దినోత్సవం గా జరపాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది

ANDHRA PRADESH NEWS

వైయస్సార్సీపీలో చేరిన ఏపీ మాజీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజ నాథ్

ఫిబ్రవరి 24 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

నీతి అయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరి తో చంద్రబాబు భేటి

NATIONAL NEWS

నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల చేయనున్నారు

మహారాష్ట్ర ఎన్నికలలో భారీ అక్రమాలు జరిగాయని రాహుల్ గాంధీ మరోసారి ఆరోపించారు.

ఫిబ్రవరి 10 నుండి 12 వరకు ప్రాన్స్, 12, 13వ తేదీల్లో అమెరికాలో పర్యటించనున్న ప్రధాని మోడీ.

నూతన ఆదాయపన్ను బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది త్వరలోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు

ముడా కేసులో సిద్దరామయ్యకు ఊరట

దేశంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి 100 గిగావాట్లకు చేరినట్లు కేంద్రం ప్రకటించింది

విదేశాలలోని జైళ్లలో ఖైదీలుగా ఉన్న భారతీయుల సంఖ్య 10,152 మంది అని విదేశాంగ శాఖ ప్రకటించింది.

INTERNATIONAL NEWS

అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పై ఆంక్షలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు

BUSINESS NEWS

ఆర్.బి.ఐ తన ద్రవ్య పరపతి సమీక్ష విధానంలో రేపో రేటును 0.25% తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రేపోరేట్ 6.25 శాతానికి దిగివచ్చింది.

సెన్సెక్స్ 198, నిఫ్టీ 43 పాయింట్ల చొప్పున నష్టపోయాయి.

SPORTS NEWS

అంతర్జాతీయ టెస్టులలో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ 36వ సెంచరీ సాధించాడు. శ్రీలంక జరుగుతున్న టెస్టులో సాధించాడు

నేటి నుండి రంజీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లు ఆరంభం

నేడు దక్షిణాఫ్రికా t20 లీగ్ ఫైనల్ మ్యాచ్ లో తలబడనున్న సన్ రైజర్స్ ఈస్టర్న్ & ఎంఐ కేప్‌టౌన్

EDUCATION & JOBS UPDATES

NEET UG 2025 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ బిఈడి వెబ్ ఆప్షన్లకు ఫిబ్రవరి 9 తో ముగుస్తున్న గడువు

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు