TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 08 – 08 – 2024

BIKKI NEWS (AUG 08) : TODAY NEWS IN TELUGU on 8th AUGUST 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 8th AUGUST 2024

TELANGANA NEWS

బీఆర్‌ఎస్‌ పాలన చేనేతకు స్వర్ణయుగం.. కాంగ్రెస్‌ పాలనలో మళ్లీ సంక్షోభంలోకి: కేటీఆర్‌

రైతు రుణమాఫీ కాలేందంటూ.. 48 గంటల్లో 3,562 కాల్స్‌, 42,984 వాట్సాప్‌ మెస్సేజ్‌లు వచ్చాయని బీఆరెస్ నాయకులు తెలిపారు.

ఆర్టీసీ లో సెమీ డీలక్స్ – కనీస చార్జీ 30/-

టీచర్లకు ఇక ఓడీలు , డిప్యూటేషన్ లు – విద్యాశాఖ ఉత్తర్వులు జారీ.

భద్రాచలం జలదిగ్భంధం. తెల్లవార్లు జోరువాన

తెలంగాణ అభివృద్ధి కి ప్రపంచ బ్యాంకు సహకారం – సీఎం రేవంత్ రెడ్డి

త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకం – భట్టి

జీవో 33 తో తెలంగాణ బిడ్డలకు అన్యాయం – హరీష్ రావు

ANDHRA PRADESH NEWS

జగన్‌కు ప్రభుత్వం భద్రత కల్పించాల్సిందే.. చంద్రబాబు సర్కార్‌కు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

దేవాన్ష్‌కు ఆరుగురు సెక్యూరిటీని ఎలా పెట్టారు.. చంద్రబాబును నిలదీసిన అంబటి రాంబాబు

కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్‌ .. అక్టోబర్‌ మొదటి తేదీ నుంచి నూతన ఎక్సైజ్‌ పాలసీ : మంత్రి పార్థసారథి

ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద.. 70 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

వివేకా హంతకులకు అండగా నిలిచిన వారిపై చర్యలు తీసుకోవాలి .. హోంమంత్రిని కలిసిన వైఎస్‌ సునీత

చేనేత వస్త్రాలపై జీఎస్టీ తొలగించేందుకు చర్యలు.. లేకపోతే రియింబర్స్‌మెంట్‌ ఇస్తా : చంద్రబాబు

NATIONAL NEWS

మరో ఐదు రోజుల్లో నీట్‌ పీజీ-2024 పరీక్ష జరగనున్న క్రమంలో ప్రశ్నాపత్రం లీకైందన్న ప్రచారం కలకలం రేపుతున్నది.!

అసమానతలను అరికట్టేందుకు రాజ్యాంగం శక్తివంతమైన సాధనమని సీజేఐ చంద్రచూడ్‌ అన్నారు.

ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌’ ఈవోఎస్‌-08 ప్రయోగాన్ని ఆగస్టు 15న చేపట్టబోతున్నట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) బుధవారం వెల్లడించింది.

ప్రముఖ జీవరసాయన శాస్త్రవేత్త(బయోకెమిస్ట్‌) గోవిందరాజన్‌ పద్మనాభన్‌ మొదటి ‘విజ్ఞాన్‌ రత్న’ పురస్కారానికి ఎంపిక అయ్యారు.

ఢిల్లీ హైకోర్టుకు పూజా ఖేద్కర్‌.. యూపీఎస్సీ నిర్ణయంపై సవాల్‌

వయనాడ్‌ విపత్తును నేషనల్‌ డిజాస్టర్‌గా ప్రకటించాలి.. లోక్‌సభలో రాహుల్‌ గాంధీ

12 రాజ్య‌స‌భ స్థానాల‌కు సెప్టెంబ‌ర్ 3న ఉప ఎన్నిక‌లు.. తెలంగాణ‌లో ఒక స్థానానికి పోలింగ్

ఆర్దిక బిల్లుకు లోక్‌సభ ఆమోదం.

INTERNATIONAL NEWS

భారత సరిహద్దు కు పోటెత్తిన బంగ్లాదేశీయీలు

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ బడిలో దిగనున్న రాజపక్ష కుటుంబం

భూగోళంపై 7 ఖండాలు లేవని, ప్రస్తుతానికి 6 ఖండాలే ఉన్నాయని నూతన అధ్యయనంలో పరిశోధకులు తేల్చారు. మనం అనుకుంటున్నట్టుగా ఉత్తర అమెరికా, యూరప్‌ వేరుపడలేదని,

BUSINESS NEWS

లాభాల బాటలో సెన్సెక్స్
సెన్సెక్స్ : 79468 (875)
నిఫ్టీ : 24298 (305)

నేడు ఆర్బీఐ ద్రవ్యపరపరతి సమీక్ష నిర్ణయాలు వెల్లడించనున్న ఆర్బీఐ గవర్నర్.

10 నాణెం పై సంకోచం వద్దు. – ఆర్బీఐ

73 లక్షల మొబైల్ కనెక్షన్లు రద్దు.

యూట్యూబ్ షార్ట్స్ కు లక్ష కోట్ల వ్యూవ్స్

టాటా కర్వ్ ఈవీ ఒకసారి చార్జింగ్ తి 502 – 585 కీమీ ప్రయాణం.

SPORTS NEWS

వినేశ్‌ పోగట్… 100 గ్రాముల తేడాతో పసిడి పోరుకు దూరం. అధిక బరువు కారణంగా అనర్హత వేటు.

రెజ్లింగ్ కు వీడ్కోలు పలిన వీనెశ్ పోగట్

తృటిలో కాంస్య చేజార్చుకున్న మీరాబాయ్ చాను

టేబుల్‌ టెన్నిస్‌లో క్వార్టర్స్‌ చేరిన భారత మహిళల బృందం.. 1-3తోజర్మనీ చేతిలో ఓడటంతో టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ కథ ముగిసినైట్టెంది

ఆకుల శ్రీజ, అర్చనా కామత్‌ డబుల్స్‌లో ఓటమితో బోణీ కొట్టగా సింగిల్స్‌లో మనికా బాత్రదీ అదే దారి. సోమవారం భారత పురుషుల జట్టు సైతం ప్రిక్వార్టర్స్‌లోనే వైదొలిగిన విషయం విదితమే.

యువ రెజ్లర్‌ అంతిమ్‌ పంగల్‌ మహిళల 53 కిలోల విభాగంలో పోటీ పడ్డ అంతిమ్‌ 0-10తో యెటెగి జెయ్నెప్‌ (టర్కీ) చేతిలో చిత్తుగా ఓడింది.

శ్రీలంక తో వన్డే సిరీస్ ను 2-0 తేడాతో ఓడిపోయిన టీమిండియా. 27 సంవత్సరాల లంకపై తర్వాత వన్డే సిరీస్ ఓటమి.

EDUCATION & JOBS UPDATES

టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ‘కేసీఆర్‌ కొలువుల’ భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. టీఆర్టీ – 2017 ఫలితాలను బుధవా రం టీజీపీఎస్సీ విడుదల చేసింది.

TGPSC – డిపార్ట్మెంటల్ టెస్టు మే 2024 సెషన్ ఫలితాలు విడుదల.

TGPSC – సెప్టెంబ‌ర్ 20 నుంచి పాలిటెక్నిక్ లెక్చ‌ర‌ర్స్ స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్

ఈ ఏడాది బీటెక్‌ కోర్సుల్లో 19,278 సీట్లకు కోతపడింది. ఈ సీట్లన్నీ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలవే కావడం గమనార్హం.

దోస్త్ ప్రత్యేక విడతలో 44,683 మందికి సీట్లు

కేంద్ర ప్రభుత్వశాఖలు, ప్రభుత్వరంగ సంస్థల్లో 16 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, వాటన్ని ంటినీ వెంటనే భర్తీ చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు