Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 07 – 04 – 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 07 – 04 – 2025

BIKKI NEWS (APRIL 07) : TODAY NEWS IN TELUGU on 7th APRIL 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 7th APRIL 2025

TELANGANA NEWS

అంగరంగ వైభవంగా భద్రాద్రి రాములోరి కళ్యాణం జరిగింది. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి.

నేడు గోదావరి బోర్డు భేటీ కానుంది. దీనిలో బనకచర్లపై కీలక చర్చ జరగనుంది.

రీజినల్ రింగ్ రోడ్డు వెంపటి సర్వీస్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు

కంచ గచ్చిబౌలి భూములపై పోరాటం ఆగదని కేటీఆర్ తెలిపారు

సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి భోజనం చేశారు

కొత్తగూడెంలోని మైనింగ్ కళాశాలను ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా ఉన్నతీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

ANDHRA PRADESH NEWS

శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా

కోనసీమలో హెపటైటిస్ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం

అమెరికాతో చర్చించి ఆక్వా రంగంపై విధించిన టారిఫ్ లను ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి బాబు సూచించారు

విశాఖ నగరంలో ఫిన్ టెక్ సిటీ ఏర్పాటుకు చర్యలు

బంగాళాఖాతంలో అల్పపీడనం మరో నాలుగు రోజులపాటు వర్షాలు

NATIONAL NEWS

ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌కు యూకే ‘ద ఫ్రెడ్‌ డారింగ్టన్‌ శాండ్‌ మాస్టర్‌ అవార్డ్‌’ను ప్రకటించింది.

43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు (ఆర్‌ఆర్‌బీ)ల ఏకీకరణ చేసి ఒకే రాష్ట్రం ఒకే ఆర్ఆర్‌బీ విధానం తెస్తామని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు

శ్రీరామ జన్మభూమి అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై సూర్య తిలకం శోభాయమానంగా ప్రకాశించింది

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ.

పాంబన్‌ బ్రిడ్జి ప్రారంభించి.. జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ

తమిళనాడులో రూ.8300కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.

పంజాబ్ రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ 130 రోజుల తర్వాత దీక్ష విరమించారు

పోర్చుగల్, స్లోవేకియా పర్యటనకు బయలుదేరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

దేశంలో తగ్గుతున్న జనాభా వృద్ధి రేటు . కేంద్రం గణాంకాలు వెల్లడి

INTERNATIONAL NEWS

అమెరికా ప్రజలు “హ్యాండ్సాఫ్‌” పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగారు. దేశంలోని 50 రాష్ర్టాల్లో దాదాపు 1400 చోట్ల భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

BUSINESS NEWS

అమెరికా టారిఫ్ లు మరియు ఆర్బీఐ ద్రవ్య సమీక్ష సమావేశం నిర్ణయాలపై ఈ ధారు స్టాక్ మార్కెట్ గమనం ఆధారపడనుంది.

SPORTS NEWS

IPL 2025 – హైదరాబాద్ పై గుజరాత్ ఘనవిజయం. హైదరాబాద్ కు వరుసగా 4వ ఓటమి

ప్రపంచ కప్ షూటింగ్ లో భారత షూటర్ రుద్రాంక్ష్ పసిడి పతకం గెలుచుకున్నాడు.

తొలిసారి నిర్వహించిన వరల్డ్ బాక్సింగ్ కప్ 2025 లో భారత్ ఆరు పథకాలు గెలుచుకుంది. ఇందులో ఒక స్వర్ణం, ఒక రజతం, 4 కాంస్య పతకాలు ఉన్నాయి.

జపాన్‌ గ్రాండ్‌ ప్రి 2025 విజేత వెర్‌స్టాపెన్‌

EDUCATION & JOBS UPDATES

UGC : యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మార్గదర్శకాలను యూజీసీ విడుదల చేసింది

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు