Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 06 – 10 – 2024

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 06 – 10 – 2024

BIKKI NEWS (OCT. 06) : TODAY NEWS IN TELUGU on 6th OCTOBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 6th OCTOBER 2024

TELANGANA NEWS

ముసీ నది ఎఫ్‌ఆర్‌ఎల్‌ నుంచి ఇరువైపులా 30 మీటర్ల వరకు బఫర్‌జోన్‌ – సీఎం

ఢిల్లీకి డబ్బుల మూటలకే మూసీ.. సుందరీకరణ పేరిట పక్కాగా లూటిఫికేషన్‌: కేటీఆర్‌

ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో సీఎస్సీలో సీట్ల పెంపునకు అనుమతించాలంటూ గతంలో హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులను అమలు చేయలేదంటూ పలు ఇంజినీరింగ్‌ కాలేజీలు కోర్టు ధికరణ వ్యాజ్యాలను దాఖలు చేశాయి. వీటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జే శ్రీనివాస్‌రావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శనివారం విచారణ చేపట్టింది.

వినియోగదారులపై రూ.1200 కోట్ల మేరకు విద్యుత్తు చార్జీల పెంపునకు అనుమతించాలని కోరుతూ డిస్కంలు విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్‌ (ఈఆర్సీ)కి చేసిన ప్రతిపాదనలపై ఈ నెల 21 నుంచి 25 వరకు బహిరంగ విచారణ జరుగనున్నది.

గ్రామీణాభివృద్ధి శాఖ సొసైటీ ఫర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌ (ఎస్‌ఆర్‌డీఎస్‌)లో పనిచేస్తున్న ఉద్యోగులకు భద్రత కల్పించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.

నిబంధనల ప్రకారం తెలంగాణలో వరుసగా నాలుగేండ్ల్లు నివాసం ఉండి, అర్హత పరీక్ష నీట్‌ రాసినట్లయితే మెడికల్‌ అడ్మిషన్లలలో స్థానిక కోటా కింద పరిగణించాలని కాళోజీ యూనివర్సిటీని హైకోర్టు ఆదేశించింది.

హైడ్రా ఆర్దినెన్స్‌కు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం.. గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై కూడా ప‌రువు న‌ష్టం దావా వేస్తా.. కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ, ఏపీల్లో నాలుగు రోజులపాటు అతి భారీ వర్షాలు.. ఐఎండీ వార్నింగ్

ANDHRA PRADESH NEWS

ఈ ప్రభుత్వ తప్పును మాకు అంటగాడుతున్నారు.. టీడీపీపై మాజీ మంత్రి కురసాల సీరియస్‌

టీటీడీ కీలక నిర్ణయం.. రివర్స్‌ టెండరింగ్‌ విధానం రద్దు

తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలి.. ప్రముఖులు వస్తే ఆర్భాటం వద్దు.. టీటీడీ అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు కీలక సూచన

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మదురైలో కేసు న‌మోదు అయ్యింది. త‌మిళనాడు డిప్యూటీ సీఎం ఉదయానిధి స్టాలిన్‌ను ఉద్దేశించి పవ‌న్ క‌ళ్యాణ్ చేసిన‌ అనుచిత వ్యాఖ్య‌ల‌కు గాను మదురైలోని క‌మిష‌న‌రేట్‌లో వాంజినాధ‌న్ అనే న్యాయ‌వాది కంప్ల‌యింట్ ఇచ్చాడు.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మలయప్పస్వామి వారికి స్నపన తిరుమంజనం నేత్రపర్వంగా సాగింది.

దేవీ శరన్నవరాత్రులు శ్రీశైల క్షేత్రంలో మూడోరోజు భ్రమరాంబ అమ్మవారి చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు

NATIONAL NEWS

జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తప్పదని ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చాయి. హర్యానా లో కాంగ్రెస్, జమ్మూకాశ్మీర్ లో హంగ్ ఏర్పడే అవకాశం.

వలస కార్మికులకు రేషన్‌ కార్డులు మంజూరు చేయడంలో జాప్యం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల యంత్రాంగంపై సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది.ఈ-శ్రామ్‌ పోర్టల్‌లో నమోదైన వలస కార్మికులందరికీ రేషన్‌ కార్డులు ఇచ్చే అంశాన్ని విచారించారు.

పశ్చిమ బెంగాల్‌లో జూనియర్‌ డాక్టర్లు మరోసారి నిరసనను ప్రారంభించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఆరుగురు జూనియర్‌ డాక్టర్లు శనివారం నిరాహార దీక్షకు దిగారు.

షార్ట్‌ రేంజ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ని విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీవో.

ప్రధాని నరేంద్ర మోదీ కిసాన్‌ సమ్మాన్‌ నిధి విడుదల చేశారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా వాశింలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నిధుల విడుదలను ప్రారంభించారు.

INTERNATIONAL NEWS

బుర్కినా ఫాసోలో మిలిటెంట్ల కాల్పుల్లో 600 మందికిపైగా అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఫ్రెంచ్‌ ప్రభుత్వ రక్షణ ఏజెన్సీ శనివారం అంతర్జాతీయ మీడియాకు తెలిపింది.

ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో హమాస్‌ అధికారి సయీద్‌ అతల్లా అలీ హతమయ్యాడు. ఉత్తర లెబనాన్‌లో ఓ శరణార్థి క్యాంప్‌పై జరిపిన వైమానిక దాడుల్లో అతడితోపాటు కుటుంబ సభ్యులంతా మరణించినట్టు హమాస్‌ శనివారం ప్రకటించింది

ఇరాన్‌ అణు స్థావరాలను ధ్వంసం చేయాలి.. ఇజ్రాయెల్‌కు ట్రంప్‌ కీలక సూచన

BUSINESS NEWS

రిజర్వుబ్యాంక్‌ డిప్యూటీ గవర్నర్‌ రాజేశ్వర్‌ రావు పదవీకాలాన్ని ఏడాది పొడిగించింది కేంద్ర ప్రభుత్వం

గత నెల 27తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు 12.5 బిలియన్ డాలర్లు వృద్ధి చెంది 704.89 బిలియన్ డాలర్లకు చేరాయి.

స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ చైర్ పర్సన్ మాధాబీ పురీ బుచ్‌కు ఈ నెల 24న విచారణకు తమ ముందు హాజరు కావాలని పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సమన్లు జారీ చేసింది.

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌పై సౌత్‌ ఇండియా ఆర్గనైజ్‌డ్‌ రిటైలర్స్‌ అసోసియేషన్‌(ఓరా) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రెండు సంస్థలు వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టింది.

SPORTS NEWS

మహిళల టీట్వంటీ ప్రపంచకప్‌లో భాగంగా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని భారత క్రికెట్‌ జట్టు ఈరోజు పాకిస్థాన్‌తో తలపడనుంది.

ప్రతిష్టాత్మకమైన ఇరానీ కప్‌ను దేశవాళీలో దిగ్గజ జట్టు ముంబై సొంతం చేసుకుంది. ఈ ఏడాది రంజీ చాంపియన్‌ అయిన ముంబై.. ఇరానీ కప్‌లో రెస్టాఫ్‌ ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో గెలవడం ద్వారా 27 ఏండ్ల తర్వాత ఈ ట్రోఫీని ముద్దాడింది.

మహిళల టీట్వంటీ ప్రపంచకప్‌లో లంకపై ఆసీస్‌ ఘనవిజయం. ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్ పై ఇంగ్లండ్‌ విజయం.

EDUCATION & JOBS UPDATES

పీఎం యశస్వికి స్కాలర్‌షిప్‌ల కోసం బీసీ, ఈబీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎంపికైన 9, 10వ తరగతి విద్యార్థులకు రూ.75వేల చొప్పున ఉపకార వేతనం అందిస్తామని తెలిపారు.

తెలంగాణ లో బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ రాష్ట్రం లో మరో 17 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు అటానమస్‌ హోదాను దక్కించుకున్నాయి. ఇప్పటికే ఈ కాలేజీలకు నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) నుంచి ‘ఏ’ గ్రేడ్‌ లభించడంతో తాజాగా వాటికి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) అటానమస్‌ హోదాను కల్పించింది.

AP TET 2024 లో భాగంగా 3, 4 వ తేదీలలో జరిగిన పరీక్షల ప్రాథమిక కీ విడుదల

అక్టోబర్ 15న CSIR UGC NET ఫలితాలు వెలువడే అవకాశం.

ONGC లో ఎలాంటి రాత పరీక్ష లేకుండా 2236 ఉద్యోగాలు

AP KGBV లో 729 బోధనేతర సిబ్బంది ఉద్యోగాలకై నోటిఫికేషన్

UPSC – నవంబర్ 24 నుంచి IFS మెయిన్స్ పరీక్షలు

ENTERTAINMENT UPDATES

ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్నది. ఆయన కుమార్తె గాయత్రి(38) గుండెపోటుతో కన్నుమూశారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు