BIKKI NEWS (SEP. 05) : TODAY NEWS IN TELUGU on 5th SEPTEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 5th SEPTEMBER 2024
TELANGANA NEWS
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో ఇసుక ధరలకు రెక్కలొచ్చాయి. టన్ను ఇసుక ధర మళ్లీ రూ.2,200 నుంచి రూ.2,500 వరకు ఎగబాకింది
మున్నేరు వరదల కారణంగా ఖమ్మం నగరంలో సుమారు 5 వేల ఇండ్లు, ఇతర ప్రాంతాల్లో మరో 2,500 కలిపి మొత్తం 7,500 ఇండ్లు ముంపునకు గురయ్యాయని ప్రాథమికంగా అంచనా వేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులకు డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ రూట్ బస్సుల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులకు టికెట్ ధరపై 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు.
సమ్మక్క సారలమ్మ దీవెనలతోనే ప్రజలంతా సురక్షితంగా బయటపడ్డారని, గ్రామాల వైపు సుడిగాలి మళ్లితే పెను విధ్వంసం జరిగేదని రాష్ట్ర మంత్రి సీతక్క ఆందోళన వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో వరద ప్రమాదాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు.
వర్షాలు, వరదల నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్తు పునరుద్ధరణ పనులు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు.
ఖమ్మం జిల్లాలోని మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో బుధవారం పర్యటించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చుక్కెదురైంది. సాక్షాత్తూ సొంత నియోజకవర్గంలోనే నిరసన సెగ తగిలింది.
గురువారం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, రాబోయే ఐదురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందజేసే రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఈ ఏడాది 117 మందిని వరించాయి.
నాడు కేసీఆర్ హయాంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించిన గురుకులాలను నేడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ధ్వంసం చేయాలని కుట్రలు పన్నుతున్నదని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీపై దేశంలో తొలిసారి జరుగనున్న అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యమిచ్చేందుకు హైదరాబాద్ సిద్ధమైంది.
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న పార్ట్‌టైం ఉద్యోగులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు.
మేడారం అడవుల్లో సుడిగాలి బీభత్సం.. ఒకే ఏరియాలో 50వేలకు పైగా చెట్లు నేలమట్టం
ANDHRA PRADESH NEWS
వరద బాధితులకు ఏపీ ఎన్జీవో రూ. 120 కోట్ల భారీ విరాళం.
చంద్రబాబు ఇంట్లో ఉండలేని పరిస్థితులు.. కాబట్టే కలెక్టరేట్‌లో ఉండి బిల్డప్‌లు : వైఎస్ జగన్
ఏపీలో తలెత్తిన విపత్తుపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు స్పందించడం లేదని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
అమరావతిపై తప్పుడు ప్రచారం చేసే వారిని సంఘ బహిష్కరణ చేయాలి : చంద్రబాబు
ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి.. విజయవాడ – హైదరాబాద్ రైల్వే సర్వీసులు ప్రారంభం
NATIONAL NEWS
ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ప్రతి ఏడాది 10.2 మిలియన్ టన్నుల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నది. ఇది తరువాతి పెద్ద కాలుష్య దేశాల కంటే రెండింతలు ఎక్కువని ఒక నివేదిక వెల్లడించింది.
ముడా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గౌరవంగా పదవికి రాజీనామా చేయాలని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యెడియూరప్ప సూచించారు.
ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించి అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలకు పింఛన్ ఇవ్వొద్దని హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
జాతీయ భావాలు దెబ్బతినకుండా ఇకపై తమ కంటెంట్ విషయంలో జాగ్రత్తగా ఉంటామని ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ హామీ ఇచ్చింది.
రెడ్ లైట్ జంపింగ్ కంటే.. డ్రైవింగ్‌లో ఫోన్ వాడకం వల్లే ఎక్కువ మరణాలు
రాజీవ్ కంటే రాహుల్ గాంధే మెరుగైన వ్యూహకర్త : శామ్ పిట్రోడా
వయనాడ్ బాధితులకు నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన రాహుల్ గాంధీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ బ్రూనై పర్యటనను ముగించుకొని సింగపూర్ వెళ్లారు.
అమెరికా రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృతి.. మృతుల్లో ముగ్గురు తెలంగాణ వారు
యోగి బుల్డోజర్ స్టీరింగ్‌ను యూపీ ప్రజలు మార్చేస్తారు : అఖిలేష్ యాదవ్
హిమాలయాల మంచు పొరల్లో.. 1700 రకాల ప్రాచీన వైరస్‌లు గుర్తింపు
కాంగ్రెస్‌లోకి వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా.. రాహుల్‌తో భేటీ అయిన స్టార్ రెజ్లర్లు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బ్రూనై పర్యటన కొనసాగుతోంది. రెండు రోజుల ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా మంగళవారం ప్రధాని బ్రూనై చేరుకున్నారు
INTERNATIONAL NEWS
ఆఫ్రికా దేశం నైజీరియాలో బోకో హరామ్ మిలిటెంట్లు ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ మార్కెట్‌లో చొరబడి ఇష్టానుసారంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో కనీసం 100మందికిపైగా గ్రామస్తులు మరణించారని రాష్ట్ర పోలీస్ అధికార ప్రతినిధి డంగస్ అబ్దుల్ కరీం బుధవారం మీడియాకు తెలిపారు.
ఉత్తరకొరియా నియంత కిమ్ మరో దారుణానికి పాల్పడ్డారు. దాదాపు 30 మంది అధికారులను ఉరి తీయించినట్టు సమాచారం. ఇటీవల వరదలు రావటంతో పాటు కొండ చరియలు విరిగిపడ్డాయి. వీటిని అడ్డుకోలేదని వారికి శిక్ష విధించారు.
పుతిన్‌ను అరెస్టు చేయాలని అంతర్జాతీయ క్రిమినల్‌కోర్టు (ఐసీసీ) ఆదేశాలు ఇచ్చినా.. మంగోలియా ఆ చర్యకు పాల్పడలేదు. ఐసీసీ ఇచ్చిన అరెస్టు వారెంట్‌ను మంగోలియా పట్టించుకోలేదు.
BUSINESS NEWS
వరుస లాభాలకు బ్రేక్.. భారీ నష్టాల్లో ముగిసిన బెంచ్ మార్క్ సూచీలు
సెన్సెక్స్ : 82,353 (-203)
నిఫ్టీ : 25,199 (-81)
మహీంద్రా డిస్కౌంట్ మేళా.. 3 లక్షల వరకు రాయితీ ప్రకటించిన సంస్థ
పెన్షనర్లకు శుభవార్త. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్వహిస్తున్న ఉద్యోగుల పింఛన్ పథకం (ఈపీఎస్) 1995లో ఉన్న పెన్షనర్లు త్వరలో దేశవ్యాప్తంగా ఏ బ్యాంక్ లేదా శాఖ నుంచైనా తమ పెన్షన్‌ను తీసుకోవచ్చు.
అమెరికాకు చెందిన బయోఫార్మా ఈ-జెన్‌సిస్‌కు చెందిన 40 మిలియన్ల షేర్లను కొనుగోలు చేసింది నాట్కో ఫార్మా. ఇందుకోసం సంస్థ 8 మిలియన్ డాలర్లు(రూ.70 కోట్లకు పైగా) నిధులు వెచ్చించింది.
భారీగా పెరగనున్న క్రెడిట్‌కార్డుల వినియోగం.. 2028-29 నాటికి 200 మిలియన్లకు..!
SPORTS NEWS
పారిస్ పారా ఒలింపిక్స్ లో భారత్ ఇప్పటి వరకు 22 పతకాలు సాదించింది. వీటిలో 4 బంగారు, 8 రజత, 12 కాంస్య పతకాలు ఉన్నాయి.
యూఎస్ ఓపెన్ లో పురుషుల సింగిల్స్ సెమీస్‌లో యూఎస్‌ఏ కుర్రాళ్లు టేలర్ ఫ్రిట్జ్, ఫ్రాన్సిస్ టియాఫో ముఖాముఖి తలపడనున్నారు.
యూఎస్ ఓపెన్ నుంచి జ్వెరెవ్ నిష్క్రమణ
మిక్స్‌డ్ డబుల్స్‌లో సెమీస్ చేరిన రోహన్ బోపన్న (భారత్), అల్దిలా సుత్జిజాది (ఇండోనేషియా) ద్వయం 3-6, 4-6తో టౌన్‌సెండ్-యంగ్ (అమెరికా) చేతిలో పరాభవం పాలైంది.
పారిస్ పారా ఒలింపిక్స్ లో ఆర్చరీలో భారత్‌కు తొలి పసిడిని హర్విందర్‌సింగ్ అందించాడు. టోక్యో లో కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే.
పురుషుల హైజంప్ (టీ63)లో శరద్ కుమార్, తంగవేలు మరియప్పన్ రజత, కాంస్యాలతో మెరిశారు
జావెలిన్ త్రోలో అజిత్, సుందర్ విసిరిన బరిసె.. వెండి, కాంస్యాలను పట్టుకొచ్చింది
పురుషుల షాట్‌పుట్ (ఎఫ్46)లో సచిన్ ఖిలారి సిల్వర్ గెలిచాడు.
జీవితంలో క్రికెట్ బ్యాట్ పట్టనోడు ఐసీసీ ఇన్‌చార్జి.. జై షాపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
EDUCATION & JOBS UPDATES
సర్వేపల్లి రాధకృష్ణ జయంతి సందర్భంగా నేడు జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం.
ఐటీబీపీ లో 819 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
పంజాబ్ & సింధు బ్యాంక్ లో 213 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు
పాడేరు వైద్య కళాశాలలో 53 సీట్ల భర్తీ కి అమోదం.
RRB JOBS – 1376 పారా మెడికల్ ఉద్యోగ నోటిఫికేషన్