TEACHERS DAY – జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం

  • భారతరత్న, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా

BIKKI NEWS (సెప్టెంబర్ – 05) : జాతీయఉపాధ్యాయ దినోత్సవం ( National Teachers’ Day september 05) భారతదేశంలో మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ (Sarvepally Radhakrishnan Birth Anniversary) జన్మదినం రోజు సెప్టెంబర్ 5న ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ రోజున ఉపాధ్యాయులకు జాతీయ, రాష్ట్రీయ, జిల్లా స్థాయిలలో పురస్కారాలు, గౌరవసత్కారాలు జరుగుతాయి. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబరు 5వ తేదీన జరుపుకుంటారు.

ఉపాధ్యాయ వృత్తికి సర్వేపల్లి రాధాకృష్ణన్ తెచ్చిన గుర్తింపు, గౌరవానికి గాను ప్రతీ సంవత్సరం అతను పుట్టిన రోజును సెప్టెంబరు 5 ను 1962 నుంచి ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు.

రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అతను శిష్యులు, అభిమానులు పుట్టినరోజును ఘనంగా చేస్తామని కోరగా, దానికి బదులు ఆ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా చేయాలని అతను కోరారట. ఆరోజు నుంచే అతను పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.

రాధాకృష్ణన్ తన జీవితంలో 1931లో నైట్‌హుడ్, 1954లో భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న, 1963లో బ్రిటిష్ రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గౌరవ సభ్యత్వంతో సహా అనేక ఉన్నత పురస్కారాలను పొందాడు. అతను భారతదేశంలోని వెనుకబడిన వృద్ధుల కోసం లాభాపేక్షలేని సంస్థ హెల్పేజ్ ఇండియా వ్యవస్థాపకులలో ఒకరు. రాధాకృష్ణన్ “ఉపాధ్యాయులు దేశంలో అత్యుత్తమ ఆలోచన గలవారు” అని విశ్వసించేవారు. 1962 నుండి, భారతదేశంలో ప్రతీ సంవత్సరం అతని పుట్టినరోజు సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు

సర్వేపల్లి రాధాకృష్ణన్ (1888 సెప్టెంబరు 5 – 1975 ఏప్రిల్ 17) 1962 నుండి 1967 వరకు భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన భారతీయ రాజకీయవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. అతను గతంలో 1952 నుండి 1962 వరకు భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు. అతను 1949 నుండి 1952 వరకు సోవియట్ యూనియన్‌లో భారతదేశానికి రెండవ రాయబారిగా ఉన్నాడు. అతను 1939 నుండి 1948 వరకు బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి నాల్గవ వైస్-ఛాన్సలర్‌గా, 1931 నుండి 1936 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి రెండవ వైస్-ఛాన్సలర్‌గా కూడా ఉన్నాడు.

Comments are closed.