TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 05 – 10 – 2024

BIKKI NEWS (OCT. 05) : TODAY NEWS IN TELUGU on 5th OCTOBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 5th OCTOBER 2024

TELANGANA NEWS

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను (జీహెచ్‌ఎంసీ) 4 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తామని, వచ్చే ఎన్నికల నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

హైడ్రా కూల్చివేతలను సవాలుచేస్తూ కేఏ పాల్‌ చేసిన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.

గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణకు సంబంధించిన వివాదంపై హైకోర్టు తన తీర్పును వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును తర్వాత వెలువరిస్తామని ప్రకటించింది.

రాష్ట్రంలో మరో మూడు రోజులు వానలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

అవ‌స‌ర‌మైతే రాహుల్ గాంధీ ఇంటి ముందు ధ‌ర్నా చేసి.. రుణ‌మాఫీ చేయిస్తా : హ‌రీశ్‌రావు

దొడ్డు వ‌డ్ల‌కు కూడా రూ. 500 బోన‌స్ చెల్లించాలి.. రేవంత్ స‌ర్కార్‌కు కేటీఆర్ డిమాండ్

ANDHRA PRADESH NEWS

తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ప్రత్యేక సిట్‌ ఏర్పాటుకు ఆదేశాలు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోలేకపోతే చంద్రబాబు రాజీనామా చేయాలి : వైఎస్‌ షర్మిల

సనాతన ధర్మం అంటే ఏంటో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు తెలుసా అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. శ్రీవారి విశిష్ఠతను దెబ్బతీయడంలో పవన్‌ కల్యాణ్‌ కూడా భాగమయ్యాడని విమర్శించారు. దేవుడి విషయంలో తప్పును గుడ్డిగా సమర్థించడమే సనాతనమా అని ప్రశ్నించారు.

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర బృందంతో విచారణకు సుప్రీంకోర్టు తీసుకున్న కీలక నిర్ణయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు స్వాగతించారు.

ఏపీ సీఎం చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తిచూపిందని మాజీ సీఎం వైఎస్‌ అన్నారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా రెచ్చగొడుతున్నారో సుప్రీంకోర్టు అర్థం చేసుకున్నదని తెలిపారు. అందుకే తిరుమల లడ్డూ కల్తీ అంశంలో చంద్రబాబు వేసిన సిట్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసిందని పేర్కొన్నారు.

NATIONAL NEWS

ఛత్తీస్‌గఢ్‌ ఏజెన్సీలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య శుక్రవారం భీకర పోరాటం 36 మంది మావోయిస్టులు మృతి.

షెడ్యూల్డు కులాలకు కల్పించిన రిజర్వేషన్లను వాటిలోని ఉప కులాలను వర్గీకరించి కేటాయించే అధికారం రాజ్యాంగబద్ధంగా రాష్ర్టాలకు ఉందని గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది.

బుల్డోజర్‌ జస్టిస్‌కు వ్యతిరేకంగా ఇటీవల ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించి ఏమైనా నిర్మాణాలను కూల్చేస్తే, వాటిని పునరుద్ధరించాలని ఆదేశిస్తామని గుజరాత్‌ ప్రభుత్వ అధికారులను సుప్రీంకోర్టు శుక్రవారం హెచ్చరించింది.

90 శాసనసభ స్థానాలున్న హర్యానా అసెంబ్లీకి శనివారం ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 1,031 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి, ముఖ్యంగా లఢక్‌ సెక్టార్‌లో చైనా శరవేగంగా మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నదని భారత వైమానిక దళ అధిపతి ఏపీ సింగ్‌ శుక్రవారం తెలిపారు.

15,000 మంది భారతీయ కార్మికులను ఇజ్రాయెల్‌కు మోదీ ప్రభుత్వం పంపుతోంది: ఖర్గే

కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్ పాకిస్థాన్‌కు వెళ్లనున్నారు. అక్టోబర్ 15, 16 తేదీల్లో ఇస్లామాబాద్‌లో జరుగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సమావేశానికి ఆయన హాజరవుతారు.

INTERNATIONAL NEWS

హెజ్బొల్లా కమ్యూనికేషన్‌ విభాగం కమాండర్‌ మహమ్మద్‌ రషీద్‌ సకాఫిని హతమార్చినట్టు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌(ఐడీఎఫ్‌) శుక్రవారం ప్రకటించింది. లెబనాన్‌పై తాము జరిపిన దాడుల్లో 37 మంది మృతి చెందారని చెప్పింది.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వినియోగించిన తర్వాత తన బాత్‌రూమ్‌లో బగ్గింగ్ పరికరాన్ని గుర్తించినట్లు బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ ఆరోపణ.

ఇజ్రాయెల్‌పై ఇటీవలే ఇరాన్‌ చేసిన క్షిపణి దాడులను ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ సమర్థించుకున్నారు. తమ శత్రువలను ఓడించి తీరుతామని ప్రతిజ్ఞ చేశారు.

జెఫ్‌ బెజోస్‌ను వెనక్కి నెట్టిన జుకర్‌ బర్గ్‌.. ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్న వ్యక్తిగా మెటా సీఈవో

ఎక్స్‌లో మస్క్‌ ఫాలోవర్ల సంఖ్య 200 మిలియన్లకు చేరింది

BUSINESS NEWS

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

సెన్సెక్స్ : 81,688 (-809)
నిఫ్టీ : 25,014 (-235)

శుక్రవారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.150 వృద్ధి చెంది రూ.78,450 లతో తాజా జీవిత కాల గరిష్ట రికార్డు నమోదు చేసింది.

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ.. కస్టమర్లకు కేవలం 10 నిమిషాల్లోనే సర్వీస్‌ను అందించేలా ‘బోల్ట్‌’ పేరిట ఓ స్పీడ్‌ ఫుడ్‌ డెలివరీ సర్వీస్‌ను ప్రారంభించింది.

ఆగస్టులో సేవల రంగం సూచీ 60.9గా ఉంటే.. సెప్టెంబర్‌లో 57.7కే పరిమితమైంది

SPORTS NEWS

మహిళల టీట్వంటీ వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో భారత్ న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది.

BCCI విశ్రాంత‌ ఐపీఎస్ అధికారి శ‌ర‌ద్ కుమార్‌ ను అవినీతి నిరోధ‌క విభాగానికి కొత్త‌ అధిప‌తిగా నియ‌మించింది.

భారత టెన్నిస్‌ డబుల్స్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న, తన సహచర ఆటగాడు ఇవాన్‌ డొడిగ్‌ (క్రొయేషియా) ఏటీపీ మాస్టర్స్‌ 1000 షాంఘై టోర్నీ రెండో రౌండ్‌కు ప్రవేశించారు.

భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య ఈనెల 12న హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్‌కు శనివారం నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించనున్నారు

షూటింగ్ జూనియర్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో మొత్తంగా భారత్‌ 11 స్వర్ణాలు, 1 రజతం, 4 కాంస్యాలతో 16 పతకాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

అఫ్గానిస్థాన్‌ స్టార్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గురువారం రాత్రి అఫ్గాన్ రాజధాని కాబూల్‌ లో గల ఓ ప్రైవేట్‌ హోటల్‌లో అతడి వివాహం జరిగింది

EDUCATION & JOBS UPDATES

ఎంబీఏలో 2,933, ఎంసీఏలో 1,088 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 4,021 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఐసెట్‌లో స్పెషల్‌ ఫేజ్‌ సీట్లను శుక్రవారం కేటాయించారు.

జిప్‌మర్ లో నర్సింగ్, పాలామెడికల్ కోర్సుల్లో అడ్మిషన్స్

SBI 1511 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల దరఖాస్తు గడువు అక్టోబర్ 14 వరకు పొడిగించారు.

JNTU లో MBA, MCA స్పాట్ అడ్మిషన్స్

MBBS కన్వీనర్ సీట్లకు రెండో రౌండ్ వెబ్ ఆప్షన్లకు అక్టోబర్ 6వరకు గడువు

RIMC డెహ్రాడూన్ లో 8వ తరగతి ప్రవేశాల గడువు అక్టోబర్ 10 వరకు పెంచిన APPSC

2050 నర్సింగ్ ఆఫీసర్ ల పరీక్ష నవంబర్ 23 కి మార్పు

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు