Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 04 – 10 – 2024

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 04 – 10 – 2024

BIKKI NEWS (OCT. 04) : TODAY NEWS IN TELUGU on 4th OCTOBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 4th OCTOBER 2024

TELANGANA NEWS

రైతుల‌ను మోస‌గిస్తే క‌ఠిన చ‌ర్య‌లు.. స‌న్నాల పేరిట గోల్ మాల్ క‌ట్ట‌డి.. క‌లెక్ట‌ర్లు.. ఎస్పీల‌తో సీఎం రేవంత్ వీడియో కాన్ఫ‌రెన్స్

బీఆర్‌ఎస్‌ నుంచి ఎన్నికై కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై గత నెల 9న సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును నిలిపివేయాలని కోరుతూ అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు.

గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణలో అంతిమ నిర్ణయం కమిషన్‌దేనని టీజీపీఎస్సీ గురువారం హైకోర్టుకు నివేదించింది. నోటిఫికేషన్‌ రద్దు, కొత్త నోటిఫికేషన్‌ జారీ, రిజర్వేషన్ల కల్పనలకు సంబంధించి కమిషన్‌ తీసుకున్న నిర్ణయాలే అంతిమమని పేర్కొంది.

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా బాలానగర్‌ మండ లం హస్మత్‌పేట హరిజనబస్తీ వాసులకు తహసీల్దార్‌ జారీచేసిన కూల్చివేత నోటీసులను హైకోర్టు రద్దు చేసింది

మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లను కూలిస్తే రాష్ట్ర ప్రభుత్వమే కూలుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హెచ్చరించారు

కొందరు పేదలను, కిరాయి మనుషులను ఎగదోసి మూసీ, హైడ్రా కూల్చివేతలపై రాజకీయం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

జూనియర్‌ లెక్చరర్‌ (జేఎల్‌), గ్రూప్‌ 4 పరీక్షల తుది ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ పలువురు అభ్యర్థులు గురువారం హైదరాబాద్‌ నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు.

అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో గురువారం అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు

రాష్ట్రంలో మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.2 లక్షలలోపు రుణం ఉన్న రైతులకు మాఫీ చేసిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. రూ.2 లక్షల పైన ఉన్న వారికి దసరాలోపు మాఫీ అవుతుందని పొన్నం తెలిపారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా గెలిచిన పట్నం మహేందర్‌రెడ్డిని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్‌గా నియమించింది.

డీఎస్సీ 1:3 జాబితాపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తమకు అన్యాయం జరుగుతున్నదంటూ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ కార్యాలయానికి క్యూ కట్టారు.

సికింద్రాబాద్‌ నుంచి గోవాకు రైలు.. ఆమోదం తెలిపిన రైల్వే బోర్డు

తెలుగు అకాడమీ పుస్తకాల్లో పసలేదు.. ప్రామాణికంగా తీసుకోలేం: టీజీపీస్సీ

ANDHRA PRADESH NEWS

ఇంద్ర‌కీలాద్రిపై కొలువుదీరిన క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు ఓ భ‌క్తుడు భారీ కానుక స‌మ‌ర్పించారు. వ‌జ్రాలు పొదిగిన కిరీటాన్ని కానుక‌గా అంద‌జేశారు. మ‌హారాష్ట్ర‌కు చెందిన ఆ భ‌క్తుడు ఈ గిఫ్ట్ ఇచ్చారు.

టీటీడీలో వాట్సాప్‌ ద్వారా దర్శనం బుకింగ్‌ సేవలను ప్రారంభించి, తర్వాత అన్ని ఆలయాల్లోనూ ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఆలోచిస్తున్నది.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో జె. శ్యామలరావు చెప్పారు.

ఏపీలోని వైఎస్సార్‌ కడప జిల్లాలో పెండ్లిమర్రి మండలం తుమ్మలూరు గ్రామంలో పొలం పనులకు వెళ్లిన కూలీలు ముగ్గురు పిడుగుపాటుకు గురై మృతి చెందారు.

సనాతన ధర్మం పరిరక్షణకు బలమైన చట్టాన్ని తీసుకురావాలి : పవన్‌కల్యాణ్‌

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ రిమాండ్ 14 రోజులు పొడిగింపు.

వైసీపీ కార్యకర్తలు భయపడక్కర్లేదు.. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే.. జగన్‌ కీలక వ్యాఖ్యలు.

NATIONAL NEWS

రైల్వే ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పండుగల నేపథ్యంలో బోనస్‌ చెల్లించేందుకు నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 11.72 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదక అనుసంధానిత బోనస్‌ చెల్లించనున్నట్టు కేంద్రం తెలిపింది.

సుస్థిర వ్యవసాయం, రైతుల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు కొత్తగా పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (పీఎం-ఆర్కేవీవై), కృషి ఉన్నతి యోజన పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపారు.

ఆత్మ నిర్బర్ పథకం కింద దేశీయంగా వంట నూనెల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం వచ్చే ఏడేండ్ల (2024-25 నుంచి 2030-31) కాలంలో రూ.10,103 కోట్లు ఖర్చు చేయాలని క్యాబినెట్ నిర్ణయం.

చెన్నై నగరానికి రెండో దశ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ పచ్చ జెండా ఊపింది. రూ.63,246 కోట్ల అంచనా వ్యయంతో మూడు కారిడార్ల పరిధిలో 119 కి.మీ పొడవునా మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మిస్తారు.

మరాఠీ, పాలి, ప్రకృత్, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన భాష హోదా కల్పిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది.

భార్యకు ఇష్టం లేని శృంగారాన్ని (మ్యారిటల్‌ రేప్‌) నేరంగా పరిగణించవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఛత్తీస్‌గఢ్‌లో నేరగాళ్లు ఏకంగా ఓ నకిలీ ఎస్బీఐ బ్రాంచ్‌ను ఏర్పాటుచేసి, ప్రజలను నిండా ముంచారు.

అంతర్జాతీయ స్పేస్‌ మిషన్‌ సంస్థ ‘లూనార్స్‌ రిసెర్చ్‌ స్టేషన్‌’కు అంబాసిడర్‌ ఫర్‌ ఇండియాగా మోహనసాయి ఆకుల(అమర్‌) ఎంపికయ్యారు.

కుల వివక్ష కలిగిన సుమారు 11 రాష్ర్టాల జైళ్ల నియమావళులను సుప్రీంకోర్టు గురువారం పక్కన పెట్టింది. కులాల ఆధారంగా ఖైదీలకు ప్రత్యేక వార్డులు, పనులు కేటాయించే పద్ధతిని నిరాకరించింది

బీజేపీకి ప్రచారం నిర్వహించిన రెండు గంటల్లోనే ఆశోక్ తన్వర్ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సభలో కనిపించారు. రాహుల్‌ గాంధీ, ఇతర కీలక నేతల సమక్షంలో ఆ పార్టీలోకి తిరిగి చేరారు.

ఈషా ఫౌండేష‌న్‌పై పోలీసుల యాక్ష‌న్‌కు బ్రేక్‌.. స‌ద్గురు జ‌గ్గీ వాసుదేవ్‌కు సుప్రీంలో ఊర‌ట‌

సొంత కూతురికి పెండ్లి చేసి, ఇతరులను సన్యాసినులుగా ఎందుకు మార్చుతున్నారు?.. జగ్గీ వాసుదేవ్‌ను ప్రశ్నించిన మద్రాస్‌ హైకోర్టు

INTERNATIONAL NEWS

సింగ‌పూర్ మంత్రి సుబ్ర‌మ‌ణియం ఈశ్వ‌ర‌న్‌కు ఓ కేసులో 12 నెల‌ల జైలుశిక్ష ప‌డింది. అధికారంలో ఉన్న స‌మ‌యంలో గిఫ్ట్‌లు స్వీక‌రించిన‌ట్లు 62 ఏళ్ల ఈశ్వ‌ర‌న్ కోర్టులో అంగీక‌రించారు.

బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతో టైప్‌-1 డయాబెటిస్‌ వచ్చే అవకాశం ఉన్నదని యూకేలోని కార్డిఫ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు.

మూడు నెలల క్రితం జరిపిన ఓ దాడిలో గాజాస్ట్రిప్‌లో హమాస్‌ ప్రభుత్వాధినేత రౌహి ముష్తాహను హతమార్చినట్టు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ గురువారం ప్రకటించింది.

తూర్పు ఉక్రెయిన్‌లోని వుహ్లెదార్‌ పట్టణాన్ని రష్యా సైన్యం సంపూర్ణంగా తన నియంత్రణలోకి తెచ్చుకుంది.

BUSINESS NEWS

10 లక్షల కోట్లు కోల్పోయిన మార్కెట్లు

సెన్సెక్స్ : 82,497 (-1,769)
నిఫ్టీ : 25,250 (-547)

గురువారం తులం బంగారం ధర (24 క్యారట్స్) రూ.200 వృద్ధి చెంది తిరిగి జీవిత కాల గరిష్టం రూ.78,300లకు చేరుకున్నది.

రాష్ట్రంలో 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్‌ఎనర్జీని ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంగా ముందుకెళ్తున్నామని, సెమీకండక్టర్ల పరిశ్రమల ఏర్పాటుకు ఇకడ మంచి అవకాశాలు ఉన్నాయని ఉపముఖ్యమంత్రి, ఇంధనశాఖ మంత్రి భట్టి విక్రమార్క చెప్పారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరలు పైపైకి.. భారత్‌లో చమురు ధరలు పెంచే అవకాశం.

SPORTS NEWS

యూఏఈ వేదికగా ఐసీసీ నిర్వహిస్తున్న మహిళల టీ20 ప్రపంచకప్‌ గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది

తొలి రోజు మహిళల టీట్వంటీ ప్రపంచ కప్ లో స్కాట్లాండ్‌పై బంగ్లాదేశ్‌ మరియు శ్రీలంక పై పాకిస్థాన్‌ గెలిచాయి.

పల్లెల నుంచి ప్రపంచస్థాయి క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణను స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని అన్నారు.

హెచ్‌సీఏలో 20 కోట్ల ఫ్రాడ్ జ‌రిగిన కేసులో.. మాజీ క్రికెట‌ర్ అజారుద్దీన్‌కు ఈడీ స‌మ‌న్లు జారీ చేసింది. ఇప్ప‌టికే న‌మోదు అయిన నాలుగు కేసుల్లో అజ‌ర్ బెయిల్ పొందారు.

అమెరికా యువ టెన్నిస్‌ క్రీడాకారిణి కోకో గాఫ్‌ చైనా ఓపెన్‌ సెమీస్‌కు దూసుకెళ్లింది. సెమీస్ లో బడోస తో తలపడనుంది.

శ్రీలంక స్పిన్న‌ర్ ప్ర‌వీణ్ జ‌య‌విక్ర‌మ‌పై ఏడాది పాటు అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి బ్యాన్ విధించారు. యాంటీ క‌రప్ష‌న్ కోడ్ ఉల్లంఘించిన కేసులో అత‌నిపై ఈ చ‌ర్య‌లు తీసుకున్నారు.

EDUCATION & JOBS UPDATES

తెలంగాణ లో జూనియర్ కళాశాలలకు అక్టోబర్ 6 – 13 వరకు సెలవులు.

ఏపీ టెట్ కు తొలి రోజు 87.6% మంది హజరు

SSC CGLE 2024 టైర్ 1 పరీక్ష ప్రిలిమినరీ కీ విడుదల.

9 – 12 తరగతి విద్యార్థులకు ముస్కాన్ స్కాలర్‌షిప్

ఎస్సీ స్కాలర్‌షిప్ లకు కొత్త దరఖాస్తు. కేంద్ర సహయం ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు

తెలంగాణ లాసెట్ 2024 చివరి విడత సీట్లు కేటాయించారు.

ENTERTAINMENT UPDATES

కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన ‘మా’ అసోసియేషన్

బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఓ మహిళ మరో మహిళపై వ్యాఖ్యలు చేయడం ఎంతగానో బాధించింది. మేమంతా మౌనంగా ఉండటాన్ని బలహీనతగా భావిస్తున్నారు. నాకు ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవు. మీ రాజకీయ మైలేజీ కోసం నా పేరును ఉపయోగించవద్దు. – రకూల్ ప్రీత్ సింగ్

‘గాంధీజీ’పై వెబ్ సిరీస్.. సంగీత దర్శకుడిగా ఏఆర్‌ రెహమాన్

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు