Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 30 – 04 – 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 30 – 04 – 2025

BIKKI NEWS (APRIL 30) : TODAY NEWS IN TELUGU on 30th APRIL 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 30th APRIL 2025

TELANGANA NEWS

నేడు తెలంగాణ పదవ తరగతి ఫలితాలు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి

ప్రస్తుతం కరెంటు చార్జీలు పెంచే ఉద్దేశం లేదని ఈఆర్సి చైర్మన్ నాగార్జున తెలిపారు

అవినీతి కారణంగానే కాళెశ్వరం కూలిందని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పేర్కొన్న మంత్రి ఉత్తమ్

ఎఫ్‌సెట్ కు తొలి రోజు 93 శాతం మంది హాజరయ్యారు. రెండో రోజు పరీక్షలు ఈరోజు నిర్వహించనున్నారు.

మిస్ వరల్డ్ 2025 పోటీలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

మే 1న డిగ్రీ అడ్మిషన్ల కోసం దోస్త్ షెడ్యూల్ విడుదల చేయనున్నారు

ANDHRA PRADESH NEWS

సింహాద్రి అప్పన్న ఆలయం క్యూ లైన్ వద్ద గోడ కూలి 8 మంది మృతి చెందారు

పాకిస్తాన్ పై ప్రేమ ఉంటే ఆ దేశం వెళ్లాలని కాంగ్రెస్ నేతలకు చెప్పిన పవన్ కళ్యాణ్

కంచి కామకోటి పీఠాధిపతిగా నేడు గణేష్ శర్మ ప్రమాణ స్వీకారం

అమరావతిలో 43 వేల కోట్ల పనులకు ప్రధాన నరేంద్ర మోడీ శంకుస్థాపకులు చేయనున్నారు

జూన్ లో కూటమి వైఫల్యాలపై నిరసనలు తెలియజేయాలని వైయస్ జగన్ పిలుపునిచ్చారు

నేడు విజయవాడకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు

మే 6న ఏపీ ఈసెట్ పరీక్ష నిర్వహించనున్నారు

NATIONAL NEWS

సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు, సైన్యంపై పూర్తి నమ్మకం ఉన్నట్లు ప్రధాన నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు.

వక్ఫ్ చట్టా సవరణ బిల్లుపై తాజా పిటిషన్ లు విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ.

21వ శతాబ్దపు అవసరాల మేరకు విద్యావ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని నరేంద్ర మోడీ సూచించారు

సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ను ద్రౌపది సంతకం చేశారు. మే 14న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

మే 29 న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి శుభాన్ష్ శుక్లా ప్రయాణించనున్నారు.

INTERNATIONAL NEWS

కెనడా సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్ పార్టీ విజయం, ప్రధానమంత్రి గా మార్క్ కార్నీ

పాకిస్తాన్ రక్షణ మంత్రి ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్ ను భారత్ లో నిషేధించారు

BUSINESS NEWS

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

సెన్సెక్స్ 70 పాయింట్స్, నిఫ్టీ 7.45 పాయింట్స్ లాభంతో ముగిశాయి.

డాలర్ తో రూపాయి విలువ 85.13 రూపాయలు గా నిలిచింది.

24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 440/- రూపాయలు పెరిగి 97,970/- కి చేరింది.

అక్షయ తృతీయ కు వ్యాపారం 16 వేల కోట్లకు చేరోచ్చని ఒక ప్రైవేటు సంస్థ అంచనా వేసింది

SPORTS NEWS

IPL 2025 – డిల్లీ కెపిటల్స్ పై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం

నేడు ఐపీఎల్ లో చెన్నై – పంజాబ్ ల మద్య మ్యాచ్ జరగనుంది.

ముక్కోణపు సిరీస్ లో దక్షిణాఫ్రికా పై భారత మహిళల జట్టు గెలుపు

EDUCATION & JOBS UPDATES

నేడు తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

నేటితో ముగియనున్న తెలంగాణ టెట్ దరఖాస్తు గడువు.

నేటితో ముగుస్తున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు మరియు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ గడువు

మే 1న డిగ్రీ అడ్మిషన్ల కొరకు దోస్త్ షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.

మే 6న ఏపీ ఈసెట్ పరీక్ష

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు